Site icon Prime9

Prabhas Varsham: అక్టోబర్ 23న “వర్షం” రీ రిలీజ్..!

varsham movie re release

varsham movie re release

Prabhas Varsham:  ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… ప్రభాస్ త్రిష జంటగా నటించి బ్లాక్ బాస్టర్ హిట్ సాధించిన చిత్రం వర్షం. ఈ సినిమాలో హీరో గోపీచంద్ స్ట్రాంగ్ విలన్ రోల్ పోషించి తెలుగు ప్రజలను ఎంతగానో మెప్పించారు. కాగా ఈ చిత్రం మరల థియేటర్లలో సందడి చేయనుంది.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజును పురస్కరించుకుని  వర్షం మళ్లీ విడుదలకానుంది. ఇటీవలె కాలంలో పాత సినిమాలను మరల రిలీజ్ చేస్తున్న ట్రెండ్ కొనసాగుతుంది. మొన్నామధ్యనే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జల్సా, మహేశ్ బాబు బర్త డే నేపథ్యంలో పోకిరి చిత్రాలను థియేటర్లలో మరల రిలీజ్ చేసి మంచి కలెక్షన్లు కొల్లగొట్టారు. కాగా మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ప్రజలెప్పడూ ఆదరిస్తారని చెప్పడానికి ఇవే ప్రత్యక్షసాక్ష్యంగా చెప్పవచ్చు.

వర్షం సినిమా మరల కలెక్షన్ల వర్షం కురిపించేందుకు సిద్ధంగా ఉంది. వచ్చేనెలలో వర్షం “4K”లో రీ రిలీజ్ చేయనున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. కాగా అక్టోబర్ 23 ప్రభాస్ పుట్టిన రోజు కాబట్టి అంతకంటే ముందుగానే ఈ సినిమా మరల విడుదలవనుందని టాక్ నడుస్తుంది.

ఇదీ చదవండి: Nagarjuna The Ghost Movie: హిందీలోనూ నాగ్ “ది గోష్ట్” సినిమా

Exit mobile version