Site icon Prime9

Katragadda Murari: నిర్మాత కాట్రగడ్డ మురారి కన్నుమూత

Producer Katragadda Murari is no more

Producer Katragadda Murari is no more

Katragadda Murari: ప్రముఖ టాలీవుడ్ నిర్మాత కాట్రగడ్డ మురారి(78) శనివారం రాత్రి కాలంచేశారు. నిన్న రాత్రి 8.50 నిముషాలకు తన నివాసంలో కన్నుమూశారు. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా విజయవాడలో 1944 జూన్ 14వ తేదీన కాట్రగడ్డ జన్మించారు. వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేసి ఆ తర్వాత సినిమా పరిశ్రమపై ప్రేమతో మద్రాసులో అడుగుపెట్టి అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత నిర్మాతగా మారారు.

కాట్రగడ్డ యువ చిత్ర ఆర్ట్స్ బ్యానర్‌పై ఎన్నో విజయవంతమైన సినిమాలను నిర్మించారు. బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, శోభన్ బాబు, కృష్ణంరాజు లాంటి అగ్రహీరోలతో సినిమాలు రూపొందించారు. సీతామాలక్ష్మి, త్రిశూలం, జానకీ రాముడు, గోరింటాకు , నారీ నారీ నడుమ మురారి చిత్రాలను కాట్రగడ్డ మురారి నిర్మించారు. 2012లో నవ్విపోదురు గాక పేరుతో తన ఆత్మకథ రాశారు.

Exit mobile version