Site icon Prime9

Hansika:పెళ్లి పీటలెక్కనున్న హన్సిక.. వరుడు ఎవరనేది సస్పెన్స్.!

heroine hansika to get married on december

heroine hansika to get married on december

Hansika: చైల్డ్‌ ఆర్టిస్టుగా అరంగేట్రం చేసి, పదహారేళ్ళకే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి, సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన వారిలో హన్సిక మొత్వాని ఒకరు. ‘దేశముదురు’, ‘మస్కా’, ‘బిల్లా’, ‘కందిరీగ’ వంటి పలు చిత్రాలలో నటించి హన్సిక తెలుగు ఇండస్ట్రీలోనూ తనకంటూ మంచి ఫాలోయింగ్‌ ఏర్పరచుకుంది. ఇదిలా ఉంటే ఈ ముద్దుగుమ్మకు సంబంధించి ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ అందాల తార త్వరలో పెళ్లిపీటలెక్కబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

అందాల భామ హన్సిక మొత్వాని త్వరలో పెళ్ళి పీటలెక్కనుంది. ఈ ఏడాది డిసెంబర్‌ చివర్లో ఈమె పెళ్ళి చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది. అయితే వరుడు ఎవరు అన్నది హన్సిక కుటుంబీకులు సీక్రెట్‌గా ఉంచారు. జైపూర్‌లోని ముందోటా ఫోర్ట్‌ అండ్ ప్యాలెస్‌లో హన్సిక ఘనంగా పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే గెస్ట్‌ల కోసం రూమ్‌లను అలంకరణ చేస్తున్నట్లు సమాచారం. టాలీవుడ్‌ ప్రముఖులు కూడా ఈ వివాహానికి హాజరుకాబోతున్నట్టు టాక్‌. ఇకపోతే హన్సిక ఇటీవలే నటించిన ‘మహా’ సినిమా రిలీజై బాక్సాఫీస్ దగ్గర ఫేయిల్యూర్‌గా మిగిలింది. కాగా ఇప్పటి వరకు హన్సిక తెలుగు, హిందీ, తమిళ భాషల్లో కలిపి 50 వరకు చిత్రాల్లో నటించింది.

ఇదీ చదవండి: ’దసరా‘ ఫస్ట్ లుక్: పెళ్లి కూతురుగా కీర్తి సురేష్

Exit mobile version