Tollywood: ఏపీ సీఎం జగన్మోహర్ రెడ్డిని కలిసిన సంచలనాల డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తన రాజకీయ సినిమా టైటిల్ పేరును ఖరారు చేశారు. తాను తీయబోయే సినిమాలు ఒకటి కాదు రెండంటూ మరో బాంబు పేల్చారు.
మొదటి సినిమా వ్యూహం సినిమాగా ఆయన పేర్కొన్నారు. రెండో సినిమా శపధంగా సినిమాను చిత్రీకరించనున్నట్లు వర్మ తెలిపారు. రెండు సినిమాలు ఎవరి బయోపిక్ కు సంబంధించి కాదు. అంతకన్నా లోతైన రియల్ పిక్ మూవీలుగా అభివర్ణించారు.
బయోపిక్ లో అబద్ధాలు మాత్రమే ఉంటాయన్న వర్మ, రియల్ పిక్ సినిమా రెండింటిలో నూటికి నూరు పాళ్లు నిజాలే ఉంటాయని స్పష్టం చేశారు. అహంకారానికి , ఆశయానికి మధ్య జరిగిన పోరాటం నుండి ఉద్భవించిన కధాంశమే వ్యూహం కధగా ఆయన తెలిపారు. చిత్ర నిర్మాణం ఆధ్యంతం రాజకీయ కుట్రలు, విషంతో నిండి వుంటుందన్నారు. రాచకురుపు పైన వేసిన కారంతో బొబ్బలెక్కిన ఆగ్రహానికి ప్రతికాష్ట లకు రూపాలే వ్యూహం, శపధం సినిమాలుగా ఆయన పేర్కొన్నారు.
రెండు సినిమాల్లోను రాజకీయ ఆరాచకీయాలు పుష్కలంగా వుంటాయని, రాష్ట్ర ప్రజలు మొదటి చిత్రం చూసిన షాక్ నుండి తేరుకొనే లోపే ఎలక్ట్రిక్ షాక్ తో రెండో చిత్రం శపధం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి కిక్ ఎక్కిస్తుందని వర్మ తనదైన శైలిలో పేర్కొన్నారు.
వంగవీటి సినిమాను తీసిన నాటి ప్రొడ్యూసర్ దాసరి కిరణ్ నిర్మాణ సారధ్యంలో రెండు చిత్రాల నిర్మాణం సాగుతాయన్నారు. ఎలక్షన్స్ టార్గెట్ గా ఈ చిత్రం తియ్యట్లేదని చెప్తే ఎవ్వరూ నమ్మరు కనక ,ఏం చెప్పాలో, ఏం చెప్పకూడదో చెప్పాల్సిన అవసరం లేదని మీకు వేరే చెప్పక్కర్లేదు కనక చెప్పట్లేదని రాజకీయ సినిమాపై వర్మ తేల్చి చెప్పారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను అడ్డుకొనేందుకు వర్మను ఓ సినిమా తీయాలని జగన్ తో సాగిన రహస్య చర్యలు నేపధ్యంలో సంచలనాల దర్శకుడు రాంగోపాల్ చూచాయగా అవునంటూ చెప్పేశారు.
ఇది కూడా చదవండి:Janasena Party: మంత్రులూ.. మీ పాలనాభివృద్ధిని వివరించరూ! సోషల్ మీడియా వేదికగా జనసేన సూటి ప్రశ్నలు
నేను అతి త్వరలో “వ్యూహం” అనే రాజకీయ సినిమా తియ్యబోతున్నాను ..ఇది బయోపిక్ కాదు …బయో పిక్ కన్నా లోతైన రియల్ పిక్.
బయో పిక్ లో అయినా అబద్దాలు ఉండొచ్చు కానీ ,రియల్ పిక్ లో నూటికి నూరు పాళ్ళు నిజాలే ఉంటాయి.— Ram Gopal Varma (@RGVzoomin) October 27, 2022
అహంకారానికి , ఆశయానికి మధ్య జరిగిన పోరాటం నుండి ఉద్భవించిన “వ్యూహం” కధ , రాజకీయ కుట్రల విషం తో నిండి వుంటుంది .
రాచకురుపు పైన వేసిన కారం తో బొబ్బలెక్కిన ఆగ్రహానికి ప్రతికాష్టే “వ్యూహం” చిత్రం.— Ram Gopal Varma (@RGVzoomin) October 27, 2022
ఈ చిత్రం 2 పార్ట్స్ గా రాబోతుంది .. మొదటి పార్ట్ “వ్యూహం” ,2nd పార్ట్ “శపథం” .. రెండింటిలోనూ రాజకీయఆరాచకీయాలు పుష్కలంగా వుంటాయి.
రాష్ట్ర ప్రజలు మొదటి చిత్రం “వ్యూహం “ షాక్ నుంచి తెరుకునే లోపే వాళ్ళకి ఇంకో ఎలెక్ట్రిక్ షాక్ , పార్ట్ 2 “శపథం “ లో తగులుతుంది .
— Ram Gopal Varma (@RGVzoomin) October 27, 2022