Site icon Prime9

Mehreen: ముఖం నిండా సూదులతో.. టాలీవుడ్ హీరోయిన్ వైరల్ ఫొటో

The heroine with needles on her face

The heroine with needles on her face

 Mehreen: ఇటీవల కాలంలో హీరోయిన్లు తమ అందానికి మెరుగులు దిద్దేందుకు వింత వింత థెరపీలు చేయించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన మెహరీన్ చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది కాస్త భయంగా ఉందనే చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ఫొటోలో మెహరీన్ ముఖం మొత్తం సూదులతో నిండిపోయింది. మొహం నిండా సూదులు గుచ్చుకొని ఉన్నప్పటికీ ఆమె చిరునవ్వులు చిందిస్తూ ఫొటోకు పోజిచ్చింది.

దీని గురించి మెహరీన్ వివరిస్తూ.. ‘ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. అక్యూ స్కిన్ లిఫ్ట్ అనే ఈ థెరపీ ద్వారా నా అందాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తున్నాను అని చెప్పుకొచ్చింది. వైద్యుల పర్యవేక్షణలో దీనికి చికిత్స తీసుకుంటున్నాను. ఈ థెరపీ తర్వాత నా ముఖం మరింత మెరుపుతో అందంగా కనిపిస్తుంది’ అని పేర్కొంది. ఇటీవల చాలా మంది హీరోయిన్లు ఆక్యు స్కిన్ లిఫ్ట్ ట్రీట్‌మెంట్‌తో తమ అందాన్ని మెరుగుపరుచుకుంటున్నారు. ‘నా కోసం ఈ థెరపీ చేసినందుకు.. నా ముఖాన్ని మరింత అందంగా తీర్చిదిద్దినందుకు
థెరపిస్ట్ కి ధన్యవాదాలు’ అని చికిత్స తర్వాత థెరపిస్టుతో దిగిన ఫొటోను కూడా మెహరీన్ షేర్ చేసింది.

నాని హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘కృష్ణగాడి వీర ప్రేమ గాధ’ సినిమాతో మెహరీన్ టాలీవుడ్ కు పరిచయమయ్యింది. ఆ తర్వాత ‘మహానుభావుడు’, ‘రాజా ది గ్రేట్‌’ వంటి చిత్రాలతో హ్యాట్రిక్‌ హిట్లు సాధించింది. కాగా ప్రస్తుతం మెహరీన్ ఓ తమిళ చిత్రంతో పాటు మరో కన్నడ చిత్రంలో నటిస్తోంది. ఈ భామ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో ఎప్పుడూ టచ్ లో ఉంటోంది.

ఇదీ చదవండి: ఏడాది పూర్తిచేసుకున్న అఖండ.. ఫోటోలు షేర్ చేసిన హీరోయిన్ ప్రగ్యా

Exit mobile version