Site icon Prime9

RRR Movie Sequel: ఆర్ఆర్ఆర్ చిత్రానికి సీక్వెల్ వచ్చేస్తుంది.. రాజమౌళి క్లారిటీ

SS Rajamouli reveals RRR sequel in works

SS Rajamouli reveals RRR sequel in works

RRR Movie Sequel: ఆర్ఆర్ఆర్ ఈ చిత్రం గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. ఈ చిత్రం దేశంలోనే కాకుండా ఖండాతరాలు దాటి కూడా బాక్సాఫీసుల వద్ద కనకవర్షం కురిపించింది. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఎంతటి విజయాన్ని నమోదుచేసిందో అందరికీ తెలిసిన సంగతే. దాదాపు 1200కోట్ల వసూళ్లతో భారతీయ బాక్సాఫీస్‌ వద్ద రికార్డులన్నింటిని తిరగరాసింది. ఇకపోతే ఈ సినిమా సీక్వెల్‌ గురించి గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.

‘బాహుబలి’ తరహాలోనే భారీ స్థాయిలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సీక్వెల్‌ను తెరకెక్కించడానికి రాజమౌళి సన్నాహాలు చేస్తున్నారనే వార్తలు టాలీవుడ్ నాట వినిపిస్తున్నాయి. కాగా తాజాగా అమెరికా చికాగోలో జరిగిన ఓ కార్యక్రమంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సీక్వెల్‌పై దర్శకధీరుడు రాజమౌళి స్పష్టత నిచ్చారు. ఆర్ఆర్ఆర్ చిత్ర కథా రచయిత అయిన తన తండ్రి విజయేంద్రప్రసాద్‌ ఈ సినిమా సీక్వెల్‌ కోసం కథను సిద్ధం చేసే పనిలో ఉన్నారని తెలిపారు. ఇకపోతే సరైన సమయంలో సీక్వెల్‌ గురించిన మరిన్ని వివరాల్ని వెల్లడిస్తామని ఆయన తెలిపారు. కాగా ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి తన తదుపరి చిత్రాన్ని చేయబోతున్న విషయం తెలిసిందే.

ఇదీ చదవండి: అలనాటి తారలు ఒక్కటైన వేళ.. ఫొటోలు వైరల్

Exit mobile version