Site icon Prime9

Pathaan teaser: హాలీవుడ్ సినిమాను తలదన్నెలా పటాన్ టీజర్

Pathaan-teaser creates a new record in bollywood

Pathaan-teaser creates a new record in bollywood

Tollywood: పఠాన్ టీజర్‌లో యాక్షన్ సీన్లు, ఫైట్స్ హైలెట్‌గా కనిపించాయి. రక్తంతో తడిసిన దుస్తులు, విమానాలు, హెలికాప్టర్లతో తెరకెక్కించిన సన్నివేశాలు హాలీవుడ్ సినిమాను తలదన్నెలా ఉన్నాయి. ఇక బైక్ ఛేజింగ్ సీన్లు ఐతే చెప్పే పనే లేదు. పర్వత ప్రాంతాల్లో షూట్ చేసిన సన్నివేశాలు టెక్నికల్‌ పరంగా చాలా బాగున్నాయి. చాలా రోజులుగా అభిమానులకు దూరమైన షారుక్ ఖాన్ అదిరిపోయే బిర్యానీ లాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేసి టీజర్ పటాపంచలు చేసింది.

పఠాన్ టీజర్‌లో బాంబ్ బ్లాస్ట్‌లు చాలా ఎక్కువగానే కనిపించాయి. భూమ్ అంటూ వాహనాలు పేల్చేయడం చూస్తే ఈ సినిమాకు భారీగానే డబ్బు పెట్టినట్టు తెలుస్తుంది. వాతావరణమంతా ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. మీరు ముందు సీట్ బెల్ట్ పెట్టుకోండి అంటూ షారుక్ హెచ్చరించడం ద్వారా టీజర్ పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. వరుస పరాజయాలతో సతమతమవుతున్న షారుక్‌కు పఠాన్ సినిమాతో మళ్లీ పాత రోజులు గుర్తు చేయనున్నారు.

Pathaan | Official Teaser | Telugu Version | Shah Rukh Khan | Deepika Padukone | John Abraham

Exit mobile version
Skip to toolbar