Shaakunthalam trailer: స్టార్ హీరోయిన్ సమంత ప్రధానపాత్రలో నటించిన ‘శాకుంతలం’ (Shaakunthalam trailer) సినిమా ట్రైలర్ వచ్చేసింది. “మాయ ప్రేమను మరిపిస్తుందేమో.. అభిమానాన్ని, అవమానాన్ని ఏ మాయ మరిపించలేదు’’ అని అంటున్నారు అగ్రకథానాయిక సమంత (Samantha). ఆమె ప్రధాన పాత్రలో నటించిన అపురూప దృశ్యకావ్యం ‘శాకుంతలం’ (Shaakuntalam) చిత్రంలోని సంభాషణలివి. గుణ శేఖర్ దర్శకత్వంలో హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. మరి ఈ సినిమా ట్రైలర్ ఎలా ఉందో అనేది ఇప్పుడు చూద్దాం.
ట్రైలర్ ఎలా ఉందంటే?
శాకుంతలం మూవీ కథ పురాణాలు తెలిసిన ప్రతి ఒక్కరికీ తెలిసిందే. ఈ కాలం పిల్లలకి పురాణాలు తెలియవు కాబట్టి యూత్ కి ఇది తెలియని కథని చెప్పొచ్చు. విశ్వామిత్ర మహర్షి కూతురే శకుంతల. ప్రకృతివనంలో పెరిగిన శకుంతల.. దుష్యంతుడనే రాజు ప్రేమలో పడి గర్భవతి అవుతుంది. దీంతో దుర్వాస మహర్షి శాపానికి బలైన శకుంతల ఎలాంటి కష్టాల పాలైనదే ఈ సినిమా కథ.
సమంత ఈ పాత్రలో మెప్పిస్తుందా !
ఇక విషయానికి వస్తే శాకుంతలం ట్రైలర్ ఆకట్టుకుంది. విజువల్ పరంగా మాత్రం ట్రైలర్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఈ సినిమాలో సమంత ప్రధాన పాత్రలో నటించగా.. దుష్యంత రాజు పాత్రను దేవ్ మోహన్ పోషించారు. మరో కీలక పాత్రలో మోహన్ బాబు నటించారు. గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై ఈ సినిమాని నీలిమ గుణ నిర్మించారు. ఫిబ్రవరి 17న దేశవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి. మైథలాజికల్ డ్రామా అంటే.. కచ్చితంగా ఆకట్టుకునే విజువల్స్.. సంగీతం.. పవర్ ఫుల్ క్యారెక్టర్స్ అన్నీ ఉండాలని ప్రేక్షకులు కోరుకుంటారు.
ఈ క్రమంలో శాకుంతలం (Shaakunthalam trailer) నుండి తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.
ఇటీవల సమంత కూడా యశోద మూవీతో మంచి హిట్ అందుకుంది.
ఇప్పుడు వీరి కాంబినేషన్ లో పాపులర్ శకుంతల లవ్ స్టోరీని తెరపైకి తీసుకొస్తుండటం ఆడియెన్స్ కి మరింత ఆసక్తి కలిగించే అంశం.
ఈ ట్రైలర్ లో వాయిస్ ఓవర్ ని సీనియర్ నటుడు శుభలేఖ సుధాకర్ అందించారు.
శాకుంతలం ట్రైలర్ చివరిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అర్హ.. శకుంతల కుమారుడు భరతుడి క్యారెక్టర్ లో ఎంట్రీ ఇవ్వడం విశేషం. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతున్న ఈ సినిమా.. మరి మైథలాజికల్ డ్రామాలలో బెస్ట్ రిజల్ట్ అందుకుంటుందేమో చూడాలి. ట్రైలర్, విజువల్స్ తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయని చెప్పాలి. ఇప్పటికే హిట్ కొట్టి ఫామ్ లో ఉన్న సమంత.. శకుంతలగా మరో హిట్ నమోదు చేస్తుందేమో చూడాలి.
ఇవి కూడా చదవండి:
నువ్వు రాజకీయాలకు పనికిరావు అన్నయ్య.. పాలిటిక్స్ కు తమ్ముడు ఉన్నాడు.. డైరెక్టర్ బాబీ కామెంట్స్
కాపుల్ని కమ్మోళ్లకి అమ్మేస్తాడని ఊహించలేదు.. రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు
టైమ్ పాస్ ప్రేమతో పిచ్చివాడనయ్యానంటూ.. బీటెక్ విద్యార్థి సూసైడ్ నోట్
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: http://Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/