Site icon Prime9

Suman: పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్న సుమన్.. ఆ పార్టీకే తన మద్దతు

Suman

Suman

Suman: సినిమాలకు, రాజకీయాలకు విడదీయరాని అనుబంధం ఉంది. తెరపై ఓ వెలుగు వెలిగిన వారిలో చాలామంది రాజకీయాల్లో తమ సత్తా చాటుతోన్నారు. అలనాటి సీనియర్‌ ఎన్టీఆర్‌ మొదలు.. ఇప్పుడు పవన్ కళ్యాణ్, రోజా వరకు అనేక మంది సినీతారలు రాజకీయాల్లో అద్భుతంగా రాణిస్తున్నారు. కాగా తాజా ఈ జాబితాలో నటుడు సుమన్ కూడా చేరనున్నాడు. దీనికి సంబంధించిన విషయనాన్ని తానే స్వయంగా ప్రకటించారు. త్వరలోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తానని సుమన్ వెల్లడించారు.

వెండి తెర నుంచి రాజకీయాలు(Suman)

సీనియర్ నటుడు సుమన్‌ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చి.. ఆ తన అందం, యాక్టింగ్ తో అ‍మ్మాయిల కలల రాకుమారుడిగా మారాడు సుమన్. పదుల సంఖ్యలో సినిమాలకు హీరోగా చేశాడు. అంతే కాకుండా వెంకటేశ్వర స్వామి గెటప్ అంటే మొదటగా గుర్తొచ్చే పేరు సుమన్ అంతలా ఆయన ఆ పాత్రకు గెటప్ కు న్యాయం చేసాడనడంలో అతిశయోక్తి లేదు. ఇక కెరీర్‌లో కొన్నాళ్లు ఎన్నో అవస్థలు పడ్డాడు. వాటన్నింటి దాటుకుని సెకండ్‌ ఇన్నింగ్స్‌లో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం సౌత్‌ ఇండస్ట్రీలోని అన్ని భాషా చిత్రాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌, విలన్‌ ఇలా వేర్వేరు పాత్రల్లో నటిస్తూ బిజీబిజీగా ఉన్నాడు.

ఇక తాజాగా సుమన్‌ తన రాజకీయ ప్రవేశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాజకీయాల్లోకి తప్పకుండా వస్తానని స్పష్టం చేశాడు. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం కోమటితిప్ప గ్రామంలో బుధవారం నిర్వహించిన ఓ ప్రైవేటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుమన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ త్వరలోనే తాను రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తాను అన్నారు. అంతేకాకుండా తెలంగాణలో తన మద్దతు బీఆర్ఎస్‌ పార్టీకే ఉంటుందని తేల్చి చెప్పారు సుమన్. రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని.. రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు ముందుకు రావాలని కోరారు. రైతులు కోరే చిన్న చిన్న సాయాలను ప్రభుత్వాలు తప్పకుండా నెరవేర్చాలని ఆయన కోరారు.

Exit mobile version