Site icon Prime9

Megastar Chiranjeevi: “అన్నయ్యా థాంక్యూ అంటూ” చిరంజీవికి సత్యదేవ్ ట్వీట్..!

satyadev tweets to thanking megastar chiranjeevi

satyadev tweets to thanking megastar chiranjeevi

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘గాడ్ ఫాదర్’ మూవీపై రోజురోజుకు అభిమానుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి. అక్టోబర్ 5న ఈ మూవీ రిలీజ్ అవనున్న నేపథ్యంలో ఈ నెల 28న అనంతపురంలో ప్రీరిలీజ్ ఈవెంట్ను గ్రాండ్‌గా నిర్వహించేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. ఈ వేడుకకు సంబంధించి ఇప్పటికే భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఇటీవల చిరజీవి ప్రత్యేకంగా విమానంలో యాంకర్ శ్రీముఖితో ఇంటర్వ్యూ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఈ ఇంటర్వ్యూలో నటుడు సత్యదేవ్ గురించి చిరంజీవి చాలా గొప్పగా చెప్పారు. ”సత్యదేవ్ రైట్ ఛాయిస్. ఆయన చాలా రిఫైన్‌డ్ యాక్టర్. ఈ మూవీలో అతను విలన్ పాత్రలో యాక్ట్ చేశాడు. మొదట్లో ఈ క్యారెక్టర్ గురించి సత్యదేవ్‌కు కాస్త ఆలోచించి చెప్పాను.

‘ప్రస్తుతం నువ్వు హీరోగా మంచిగా రాణిస్తున్నావు. ఈ రకమైన పాత్ర నువ్వు చేస్తే చాలా బాగుంటుంది. సినిమాలో ప్రధాన పాత్రలు మూడుంటే.. అందులో నీపాత్ర మూడోది. నీకు అభ్యంతరం ఉంటే వద్దు. నీ ఇష్టం’ అని సత్యదేవ్‌తో అన్నానని చిరంజీవి చెప్పారు. వెంటనే దానికి సత్యదేవ్ చాలా హ్యాపీగా ఫీలవుతూ ఈ క్యారెక్టర్ చేస్తానని చెప్పాడని ఆయన చెప్పుకొచ్చాడు. ఈ సినిమాతో అతనికి చాలా మంచి పేరు వస్తుంది. నా పేరు నిలబెడతాడు అంటూ చిరంజీవి అన్నారు.

ఇక చిరంజీవే స్వయంగా తన గురించి గొప్పగా  చెప్పడంతో సత్యదేవ్ సంతోషించారు. ‘అన్నయ్యా  నేను ఒక అభిమానిగా  మీకు ప్రేమని మాత్రమే ఇవ్వగలిగాను. మీరు నాకు జీవితంలో గుర్తుండిపోయే ఒక మైలురాయిని ఇచ్చారు. థాంక్యూ’ అంటూ ట్విట్టర్ వేదిగా స్పందించాడు.

ఇదీ చదవండి: నెట్టింట బాలయ్య సందడి.. NBK107 షూటింగ్ వీడియో వైరల్

Exit mobile version