Site icon Prime9

Jr NTR: సమంత త్వరగా కోలుకోవాలి.. జూనియర్ ఎన్టీఆర్

Jr. NTR

Jr. NTR

Tollywood: హీరోయిన్ సమంత తాజాగా తను అనారోగ్యం బారిన పడ్డానని తెలిపింది. నేను మైసిటిస్ అనే ఆటోఇమ్యూన్ కండిషన్ ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నాను. కొన్ని నెలల క్రితమే చికిత్స కూడా జరిగింది. పూర్తిగా కోలుకున్న తర్వాతే ఈ విషయం మీతో పంచుకోవాలనుకున్నా. త్వరగానే కోలుకుంటానని భావిస్తున్నాను. కానీ ఆసల్యం అవుతోంది. ప్రస్తుతం నేను నెమ్మదిగా కోలుకుంటున్నాను’ అంటూ పేర్కొంది.

దీనితో పలువురు సెలెబ్రిటీలు, అభిమానులు సమంత త్వరగా కోలుకోవాలని విష్ చేస్తున్నారు. ఇప్పటికే శ్రియాశరన్, రాశీఖన్నా, సుష్మిత కొణిదెల సమంత స్పీడ్ గా రికవరీ కావాలని ఆకాంక్షించారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించారు. సమంత త్వరగా కోలుకోవాలి. అందుకు కావాల్సినంత శక్తిని పొందాలని కోరుకుంటున్నాను అంటూ ట్వీట్ చేసారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. సమంత తన ఆరోగ్యాన్ని వివరిస్తూ పెట్టిన పోస్టుకు కొద్ది గంటల్లో కోటీన్నర వరకు లైక్ లు వచ్చాయి. సమంత నటించిన ‘యశోద’ చిత్రం వచ్చే నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version