Site icon Prime9

RRR : ఆర్ఆర్ఆర్ సినిమా జపాన్ లో అక్టోబర్ 21 న సందడి చేయబోతుంది!

ram charan 20 prime9news

ram charan 20 prime9news

RRR : బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ తెరకెక్కిన సినిమా ఆర్ఆర్ఆర్.ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమురం భీం గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే.వీరిద్దరూ నటన పరంగా ప్రేక్షకులతో విజిల్స్ వేయించుకున్నారు.ఈ సినిమా తెలుగులో, విడుదల ఐనా అన్నీ భాషల్లో బ్లాక్ బస్టర్ విజయం అందుకొని, ఇద్దరు హీరోలు పాన్ ఇండియా వ్యాప్తంగా చాలా ఫేమస్ అయ్యారు.ఈ సినిమా హిట్టుతో రామ్ చరణ్,ఎన్టీఆర్ కు క్రేజ్ను తెచ్చుకోవడమే కాకుండా వీరు తిరుగులేని స్టార్ డమ్ ను కూడా ఎంజాయ్ చేస్తున్నారు.

ఇక ఆర్ఆర్ఆర్ సినిమా కోసం నాలుగేళ్ళ పాటు ప్రేక్షకులు నిరీక్షించిన వారి నిరీక్షణకు మంచి ఫలితం దక్కింది.మరి అన్ని అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించడమే కాకుండా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

ఇదిలా ఉండగా తాజాగా రామ్ చరణ్ తన భార్య ఉపాసన తో కలిసి జపాన్ వెకేషన్ కోసం సిద్దామయ్యాడు. ఈ బెస్ట్ ఎవర్ ఇండియన్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ సినిమాను జపనీయులు కోసం జపాన్ లో కూడా ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.ఈ సినిమా జపాన్ వర్షన్ లో ఈ నెల 21న గ్రాండ్ గా విడుదల అవ్వబోతుంది.కాబట్టి చరణ్ కూడా ప్రొమోషన్స్ లో పాల్గొనడం కోసం జపాన్ బయల్దేరాడు.తన భార్యతో కలిసి వెళుతున్న ఒక ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Exit mobile version