RRR: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన “ఆర్‌ఆర్ఆర్” ని భారతీయ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో.. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, హాలీవుడ్ భామ ఒలివియా హీరోయిన్లుగా నటించారు. కాగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా, తారక్ కొమరం భీమ్ గా నటించి అందర్నీ మెప్పించారు. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకున్న ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించింది. కేవలం భారత్ లోనే కాకుండా యూఎస్, జపాన్ లోనూ ఈ సినిమాకి బ్రహ్మరధం పడుతున్నారు. అలానే ఈ చిత్రానికి అంతర్జాతీయ స్థాయిలో అవార్డులను కైవసం చేసుకుంటుంది.
లాస్ ఏంజెల్స్ లో ఆర్ఆర్ఆర్ మానియా..
కాగా ప్రస్తుతం ఆర్ఆర్ఆర్(RRR)ని సినిమాని ఆస్కార్ నామినేషన్స్ లో భాగంగా ఓటర్స్ కోసం లాస్ ఏంజెల్స్ లోని చైనీస్ థియేటర్ లో స్క్రీనింగ్ చేస్తున్నారు. ఈ సినిమా చూసేందుకు విదేశీలు ఎగపడుతున్నారు. ఏ మూవీకి లేని విధంగా ఈ చిత్రం టికెట్ లు కేవలం 96 సెకండ్లలోనే అమ్ముడుపోవడం గమనార్హం. ఇక ఈ స్క్రీనింగ్ లో రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ హాజరయ్యి.. ఓటర్లతో చిట్ చాట్ నిర్వహిస్తున్నారు. దీంతో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వారితో ఫోటోలు దిగేందుకు భారీ ఎత్తున అక్కడికి చేరుకొని రచ్చ రచ్చ చేస్తున్నారు.
ఆ రేంజ్ ఫాలోయింగ్ చూస్తుంటే ఈ స్క్రీనింగ్ జరుగుతుంది మన తెలుగు రాష్ట్రాలలో అనే డౌట్ ఖచ్చితంగా వస్తుంది. ఇక థియేటర్ లో కూడా స్క్రీన్ ముందు చిందులేస్తూ ఫ్యాన్స్ అంతా పూనకాలు తెప్పించే రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ షో కి పలువురు హాలీవుడ్ ప్రముఖులు కూడా హాజరయ్యారు.
“@RRRMovie” “Natu Natu” dance scene live on IMAX at Mann’s Chinese.#RRRMoive #BeyondFest pic.twitter.com/N2ZC9ywdqd
— The Scenestar (@TheScenestar) January 10, 2023
Do you know Naatu? #RRR #RRRmovie pic.twitter.com/J4EuTGsWKA
— IMAX (@IMAX) January 10, 2023
ఇవి కూడా చదవండి…
Kantara: బిగ్ సర్‌ప్రైజ్.. ఆస్కార్‌కు క్వాలిఫై అయిన “కాంతారా”
Unstoppable Show: అన్ స్టాపబుల్‌లో సందడి చేయనున్న “వీర సింహారెడ్డి” టీం… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Vasantha Krishna prasad: ఈ రోజుల్లో రాజకీయం చేయాలంటే 10 మంది పోరంబోకులు వెంట ఉండాలి.. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్
Pathaan Trailer: యాక్షన్.. యాక్షన్.. యాక్షన్.. దుమ్మురేపుతున్న షారూఖ్ ఖాన్ “పఠాన్” ట్రైలర్
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: http://Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/