Site icon Prime9

Raviteja: వాల్తేరు వీరయ్య దుమ్ములేపిన మాస్ మహరాజ్.. ఏసీపీ విక్రమ్ సాగర్ పై ఫుల్ మూవీ తియ్యమంటున్న రవితేజ అభిమానులు

Raviteja in waltair veerayya movie

Raviteja in waltair veerayya movie

Raviteja: వాల్తేరు వీరయ్యలో చిరంజీవి విశాఖ యాసలో మాస్ కామెడీ అండ్ డైలాగ్స్ తో వీరంగం ఆడుతుండగా సడెన్ గా ACP విక్రమ్ సాగర్(రవితేజ) క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తాడు.

సినిమాలో సెకండ్ అట్రాక్షన్ గా నిలిచిన ఈ రోల్లో రవితేజ తాండవం ఆడేశాడని చెప్పవచ్చు.

దానితో రవితేజ ఫాన్స్ అయితే ఈ రోల్లో ఫుల్ లెంగ్త్ రోల్ చెయ్యమని డైరెక్టర్ బాబీని అడిగే రేంజ్ లో ఉంది ఆ పాత్ర.

ఫ్యాన్ నుంచి సహనటుడిగా

సీరియస్ పోలీస్ ఆఫీసర్ గా తెలంగాణ యాసలో రవితేజ(Raviteja) నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

తనదైన మార్క్ పంచ్ డైలాగ్ లు, ఎంట్రీ తోనే చిరుతో కలిసి స్టెప్పులు లేస్తాడు రవితేజ. ఆ తరువాత చిరంజీవి, రవితేజ మధ్య గొడవలు ఏర్పడడం ఫైట్లు ఇలా కథ సాగుతుంది.

ఆఖరికి వీరిద్దరూ ఎలా కలిశారు.. ఆ కథేంటి అనేది వెండితెరపై చూస్తేనే కిక్ ఉంటది.

ఇడియట్ సినిమాలో చిరంజీవి కటౌట్ కి దండలేసి పాలాభిషేకాలు చేసే రోల్ నుండి ఇప్పుడు చిరంజీవి పక్కనే కటౌట్ కట్టించుకుని స్థాయికి ఎదిగారు రవితేజ.

దీనితో అటు మెగా ఫాన్స్, ఇటు రవితేజ ఫాన్స్ తెగ మాస్ మహరాజను తెగ పొగిడేస్తున్నారు.

అదీ నిజమే కదా ఇండస్ట్రీ కి రావాలి అనుకున్న ఎవరికైనా బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి నిలదొక్కుకుని దశాబ్దాల పాటు ఇండస్ట్రీ ని శాసించిన చిరంజీవి జీవితం ఒక చరిత్ర.

విలన్ పాత్రలతో కెరీర్ ని మొదలెట్టిన చిరంజీవి వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకుండా కస్టపడి ఈ స్థాయికి వచ్చారు. దాదాపు అలాంటి కష్టాలే పడి వచ్చి నిలిచిన హీరో రవితేజ.

అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎంటర్ అయ్యి క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్, సైడ్ హీరో నుండి స్టార్ హీరో గా ఎదగడానికి 36 ఏళ్ళు కష్టపడ్డాడు రవితేజ.

స్వయం కృషి తో వచ్చిన ఈ ఇద్దరు హీరోలు కలిసి నటించిన వాల్తేరు వీరయ్య సందర్భం గా అభిమానులు వీరు పడ్డ కష్టం ఎదిగిన తీరు గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

ఇద్దరూ కలిసి నటించిన సినిమాలు ఇవే..

అన్నయ్య సినిమాలో రవితేజ చిరంజీవి తమ్ముడి క్యారెక్టర్ లో ఒదిగిపోయి నటిస్తాడు.

చిరంజీవి శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో ఓ పాటలో అలా గెస్ట్ అప్పీయరెన్స్ లాగా మెరిస్తాడు రవితేజ.

ఇకపోతే చిరంజీవి హీరోగా హిందిలో తెరకెక్కిన మూవీ ఆజ్ కా గూండారాజ్. ఈ సినిమాలో కూడా రవితేజ ఓ ముఖ్య పాత్రలో నటించాడు.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

 

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version