Ram Pothineni: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీపై ప్రేక్షకుల్లో గట్టి అంచనాలే నెలకొన్నాయి. పక్కా ఊరమాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీ నుంచి గ్లింప్స్ రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. మే 15 రామ్ పుట్టినరోజు కావడంతో మూవీ నుంచి పవర్ ఫుల్ గ్లింప్స్ ని రిలీజ్ చేసి రాపో అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చారు చిత్ర బృందం.
రాపో పాన్ ఇండియా మూవీ(Ram Pothineni)
ఇక ఈ సినిమా కోసం రామ్ కొంచెం లావు అయ్యినట్లు మంచి దిట్టంగా కనిపిస్తున్నాడు. అయితే తాజా విడుదల చేసిన గ్లింప్స్ లో మొత్తం యాక్షన్ సీక్వెన్స్ సూపర్ గా చూపించాడు బోయపాటి. ఇక ఈ గ్లింప్స్ లో రామ్ చెప్పిన మాస్ డైలాగ్ అయితే నెక్ట్స్ లెవెల్ అని చెప్పాలి.. “నీ స్టేట్ దాటలేనన్నావ్ దాటా. నీ గేట్ దాటలేనన్నావ్ దాటా. నీ పవర్ దాటలేనన్నావ్ దాటా. ఇంకేంటి దాటేది నా బొంగులో లిమిట్స్” అంటూ రామ్ చెప్పిన డైలాగ్ అయితే ఇచ్చిపడేసింది. కాగా ఈ సినిమా టైటిల్ ని ఇంకా అనౌన్స్ చేయలేదు. ప్రస్తుతానికి బోయపాటిరాపో అనే హ్యాష్ ట్యాగ్ తో ఈ మూవీ చిత్రీకరణ జరుగుతుంది. టైటిల్ ఎనౌన్స్ చెయ్యడానికి కొంత సమయం పడుతుందని ఇటీవల చిత్ర నిర్మాత చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై చిట్టూరి శ్రీనివాసా ఈ మూవీని నిర్మిస్తున్నాడు. కాగా ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. పాన్ ఇండియా సినిమాగా ఈ మూవీని తెలుగు తమిళ మళయాళ కన్నడ హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 20న రిలీజ్ కానుంది.