Site icon Prime9

Ram Gopal Varma: పవన్ కల్యాణ్ 3 పెళ్ళిళ్ల పై రామ్ గోపాల్ వర్మ సినిమా?

Ram Gopal Varma

Ram Gopal Varma

Tollywood: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై వ్యంగ్యంగా సినిమా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ మేరకు కొన్ని చర్చలు కూడా జరిగాయని ఈ చిత్రానికి ఓ టైటిల్ కూడా అనుకున్నారని ప్రచారం జరుగుతోంది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు “ప్యాకేజ్ స్టార్” అనే టైటిల్ ఫిక్స్ చేసి వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఓ రాజకీయ పార్టీ ఈ చిత్రనిర్మాణానికి నిధులు సమకూర్చబోతోందని తెలుస్తోంది . ఈ సినిమా పవన్ మూడు పెళ్లిళ్ల చుట్టు తిరుగుతుందని అంటున్నారు. అయితే ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమాను ఏపీ అసెంబ్లీ ఎన్నికలముందు రిలీజ్ చేయబోతున్నట్లు టాక్ ఇంతకుముందు వర్మ పవన్ జీవితాన్ని ఉద్దేశిస్తూ పరోక్షంగా పవర్ స్టార్ అనే సినిమా తీసారు. ఈ సినిమాలో గడ్డి తిన్నావా సాంగ్, మరియు ట్రైలర్ లో సన్నివేశాలు వివాదంగా మారాయి. దీనిపై పవన్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. పవన్ వీరాభిమానులం అని చెప్పుకొనే కొందరు వర్మపై కోపంతో సినిమాలు ప్రకటించారు.

2019లో ఏపీలో ఎన్నికలకు ముందు రామ్ గోపాల్ వర్మ తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును విలన్‌గా చూపించి ఎన్నికల్లో దెబ్బతీయడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాకేష్ రెడ్డి ఈ చిత్రాన్ని ఆర్జీవీతో తీయించారని టీడీపీ ఆరోపించింది. తాజాగా బుధవారం రామ్ గోపాల్ వర్మ ఏపీ సీఎం జగన్ తో సుమారుగా 40 నిమషాలపాటు భేటీ అయ్యారు. దీని తరువాత వర్మ మీడియాతో కూడ మాట్లాడకుండా వెళ్లిపోయారు. సీఎం జగన్‌కి అనుకూలంగా వర్మ ఓ సినిమా చేయబోతున్నారనే ప్రచారం నేపధ్యంలో అది పవన్ కళ్యాణ్ పైనే ఉండవచ్చని భావిస్తున్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో వైసీపీ మంత్రులు, ఇతర నేతలు పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడ అంతే ధీటుగా సమాధానమిస్తున్నారు. మొత్తం మీద రామ్ గోపాల్ వర్మ సినిమా మీద మరికొద్ది రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశముంది.

 

Exit mobile version