Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం సూపర్ ఫామ్ లో దూసుకుపోతున్నారు. చరణ్ ఇప్పుడు అమెరికాలో సందడి చేస్తున్నారు. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అందించే అవార్డ్ ప్రధానోత్సవం కార్యక్రమంలో పాల్గొననున్నారు చరణ్. ఈ క్రమంలో అమెరికాలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన గుడ్ మార్నింగ్ అమెరికా టాక్ షోలో అలరించారు.
ఈ టాక్ షో లో పాల్గొనే అరుదైన అవకాశం రాంచరణ్ కి దక్కడం విశేషం. తాజాగా చరణ్ ఈ షోలో పాల్గొనగా.. ముగ్గురు యాంకర్లు చరణ్ తో చిట్ చాట్ చేశారు. ముందుగా గుడ్ మార్నింగ్ అమెరికా టాక్ షోలో పాల్గొనడానికి చరణ్ స్టూడియో వెళ్లగా.. బయట పెద్ద సంఖ్యలో అభిమానులు మెగా పవర్ స్టార్ కోసం ఎదురుచూశారు. వారందరికి రాంచరణ్ సెల్ఫీలు ఇచ్చాడు.
ఈ షో లో రామ్ చరణ్(Ram Charan) సంభాషణ చాలా ఫన్నీగా సాగింది. ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రధానమైనది ఏంటి ఎన్ని యాంకర్స్ ప్రశ్నించగా.. ఫ్రెండ్ షిప్, అన్నదమ్ముల బంధం అని రాంచరణ్ వివరించారు. ఆర్ఆర్ఆర్ చిత్రం నా దర్శకుడు రాజమౌళి గారి గొప్ప రచనల్లో ఒకటి. ఆయన్ని మేమెంత ఇండియన్ స్పీల్ బర్గ్ అని పిలుస్తాం అంటూ చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జక్కన్నని స్పీల్ బర్గ్ తో పోల్చారు. తన తదుపరి చిత్రంతో రాజమౌళి గ్లోబల్ సినిమాపై కూడా తన మార్క్ ప్రదర్శిస్తారు అని చరణ్ పేర్కొన్నారు. ఇక నాటు నాటు సాంగ్ డ్యాన్స్, లిరిక్స్ ఇలా అన్ని విధాలుగా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ ఐంది అని చరణ్ పేర్కొన్నాడు. 88 ఏళ్ల ఇండియన్ సినిమా చరిత్రలో తొలిసారి నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేట్ అయింది.
ఉపాసన ప్రెగ్నెన్సీ గురించి ఏం చెప్పారంటే..?
ఇంతలో మరో యాంకర్ కలగజేసుకుని… నువ్వు ఇప్పుడు చాలా బిజీగా ఉండి ఉంటావు.. ఎందుకంటే త్వరలో ఫస్ట్ బేబీ రాబోతోంది కదా అని పేర్కొంది. దీనితో మిగిలిన యాంకర్లు కూడా రామ్ చరణ్(Ram Charan) కి కంగ్రాట్స్ చెప్పారు. తండ్రి కాబోతున్నందుకు ఎలాంటి భయం ఉంది అని అడగగా.. ఇన్నేళ్లు నేను ఉపాసనకు అంతగా దొరికేవాడిని కాదు. కానీ ఇప్పుడు తప్పడం లేదు అని ఫన్నీగా చరణ్ సమాధానం ఇచ్చాడు. యాంకర్స్ లో ఒక లేడి యాంకర్ గైనకాలజిస్ట్ అని రాంచరణ్ కి ముందే తెలుసు. నేను మీ నంబర్ తీసుకుంటాను. ఉపాసన నేను అమెరికా వచ్చినప్పుడు అందుబాటులో ఉండండి అని చరణ్ ఫన్నీగా అడిగాడు. దీనితో యాంకర్.. తప్పకుండా.. మీతో కలసి ఎక్కడికైనా ట్రావెల్ చేసేందుకు సిద్ధం అని ఆ యాంకర్ పేర్కొంది.
టామ్ క్రూజ్, లియోనార్డో డికాప్రియో, ర్యాన్ రెనాల్డ్స్ వంటి హాలీవుడ్ టాప్ హీరోలు ‘గుడ్ మార్నింగ్ అమెరికా’ షోలో సందడి చేశారు. ఇండియా నుంచి ఈ షోకి వెళ్ళడం రామ్ చరణ్ తోనే మొదలు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న తొలి తెలుగు హీరో, ఇండియన్ స్టార్ ఆయనే. ఈ విషయంలో చరణ్ రికార్డ్ క్రియేట్ చేశారు.