Tollywood: మెగాస్టార్ చిరంజీవి తనయుడుగా తెలుగు సినీ పరిశ్రమలోకి ‘చిరుత’గా అడుగుపెట్టి, ఆ తర్వాత సినిమా ‘మగధీర’తో టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని, రికార్డ్ లన్ని తిరగరాసి మెగా తనయుడు నుంచి మెగా ధీరుడుగా మారాడు. నేటికీ 15 ఏళ్ళు తన నట ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు.
తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా అడుగుపెట్టి తండ్రికి తగ్గ తనయుడిగా ఆయన నటనతో కొన్ని లక్షల మంది అభిమానులను సంపాదించుకున్నారు. చిరుత సినిమాతో రామ్ చరణ్ నట ప్రస్థానం మొదలై ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్యాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. రామ్ చరణ్ 15 ఏళ్ళ సినీ కెరీర్లో ఆచార్యతో కలిపి మొత్తం 14 సినిమాల్లో నటించారు.
1985 మార్చి 27న చెన్నైలో రామ్ చరణ్ జన్మించారు. మెగాస్టార్ నట వారసుడిగా తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టి పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘చిరుత’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి మెగా పవర్ స్టార్‌గా తన కంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. రామ్ చరణ్ నటించిన చిరుత సినిమా 15 యేళ్ల కిందట 2007 సెప్టెంబర్ 28న ఈ సినిమా విడుదలై సంచలన విజయం సాధించింది. రామ్ చరణ్ మొదటి సినిమాతోనే సూపర్ హిట్‌ను అందుకున్నారు.