Site icon Prime9

రకుల్ ప్రీత్ సింగ్: “శాంటా ఇచ్చిన గొప్ప గిఫ్ట్ నువ్వే”.. సీక్రెట్ రివీల్ చేసిన టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్

rakul preet singh reveals her boy friend name

rakul preet singh reveals her boy friend name

Rakul Preet Singh: టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. అందం అభినయంతో తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో హీరోయిన్ తెలుగు తెరకి పరిచయమై మంచి గుర్తింపు తెచ్చుకుంది రకుల్. హీరోయిన్ గా పరిచయం అయిన తక్కువ సమయంలోనే తెలుగు ఇండ్రస్ట్రీలో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. వరుస ఆఫర్లతో టాలీవుడ్ శరవేగంగా దూసుకుపోతూ సినిమాలతో బిజీబిజీగా గడిపేసింది. అంతేకాకుండా స్టార్ హీరోల సరసన ఛాన్స్ దక్కించుకుని దాదాపు అందరు టాప్ హీరోలతోనూ నటించింది రకుల్. కాగా ఇటీవల కాలంలో కిక్ 2, కొండపొలం వంటి వరుస ఫ్లాప్ లు పడడంతో రకుల్ జోరు తగ్గిందనే చెప్పాలి.

ఈ అమ్మడుకు తెలుగుతో పాటు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేసి అలరించింది. ఇక ఇప్పుడు తెలుగులో తక్కువ సినిమాలు చేస్తూ కనిపిస్తుంది. కాగా రకుల్ చివరిసారిగా తెలుగులో పంజా వైష్ణవ్ తేజ్ నటించిన కొండపొలం సినిమాలో కనిపించింది. ఇక హిందీలో థాండ్ గాడ్ చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం ఆమె నటించిన ఛత్రివాలి సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదే కాకుండా ఈ ముద్దుగుమ్మ చేతిలో రెండు భారీ బడ్జెట్ తమిళ్ సినిమాలున్నాయి. అలాగే శంకర్, కమల్ హాసన్ కాంబోలో రాబోతున్న ఇండియన్ 2 సినిమాలోనూ రకుల్ నటిస్తోంది.

ఇకపోతే ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రకుల్. రోజూ హాట్ హాట్ ఫోటో షూట్స్ తో కుర్రకారు మతిపోగొడుతోంది. కాగా గత కొంతకాలంగా రకుల్, బాలీవుడ్ యాక్టర్ జాకీ భగ్నానీ తో ప్రేమలో ఉందని త్వరలో వీరద్దరూ పెళ్లిపీటలెక్కనున్నారన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఆ వార్తలను మరింత నిజం చేస్తూ ఈ ఇద్దరు కలిసి దిగిన ఫోటోలు కూడా నెట్టింట వైరల్ గా మారాయి. కాగా తాజాగా మరోసారి ప్రియుడితో ఉన్న ఫోటోను షేర్ చేసింది రకుల్. శాంటా నాకు జీవితంలో గొప్ప బహుమతిని ఇచ్చాడు అది నువ్వే.. ఐ లవ్ యూ బేబీ.. మీరు ఆశించినవన్నీ సాధించాలని కోరుకుంటున్నాను. ఎప్పుడూ నవ్వుతూ ఉండండి అంటూ క్రిస్మస్ సందర్భంగా ప్రియుడు ఫోటోను షేర్ చేసింది రకుల్. ఈ పోస్ట్ కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది. మరి రకుల్ జాకీ మధ్య నిజంగానే కుచ్ కుచ్ హోతాహై ఉందా.. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారా లేదా అనేది వేచి చూడాలి.

 

Exit mobile version