Project K: అమితాబ్ బచ్చన్ 80వ పుట్టినరోజు సందర్భంగా కొత్త పోస్టర్‌ రిలీజ్ చేసిన ఫిల్మ్ మేకర్స్

అమితాబ్ బచ్చన్ 80వ ఏట అడుగుపెట్టిన రోజు కావడంతో వైజయంతీ మూవీస్‌ నిర్మిస్తున్న ప్రాజెక్ట్ k చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసి అభిమానులను ఆశ్చర్యపరిచారు.

  • Written By:
  • Updated On - October 11, 2022 / 07:05 PM IST

Amitabh Bachchan: ప్రాజెక్ట్ k, నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన రాబోయే పాన్ ఇండియా తెలుగు సైన్స్ ఫిక్షన్ చిత్రం. ఈరోజు అమితాబ్ బచ్చన్ 80వ ఏట అడుగుపెట్టిన రోజు కావడంతో వైజయంతీ మూవీస్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసి అభిమానులను ఆశ్చర్యపరిచారు. వైజయంతీ మూవీస్ టీం ప్రాజెక్ట్ k కొత్త పోస్టర్‌ను విడుదల చేసి అమితాబ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది. ప్రాజెక్ట్ K లో దీపికా పదుకొణె, ప్రభాస్, అమితాబ్ బచ్చన్, సూర్య, దిశా పటానీ తదితరులు నటించారు. ప్రాజెక్ట్ K అక్టోబర్ 18, 2023న లేదా 2024 ప్రారంభంలో తెరపైకి వచ్చే అవకాశం ఉంది.