Site icon Prime9

ప్రభాస్: సైలెంట్ గా షూట్ కానిచేస్తున్న మారుతి.. రాజాడీలక్స్ నుంచి ప్రభాస్ లుక్స్ వైరల్.. హీరోయిన్లు ఎంతమందో తెలుసా?

prabhas rajadelux looks goes viral

prabhas rajadelux looks goes viral

Prabhas: పాన్ ఇండియా హీరో, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస భారీ సినిమాలతో బిజిబిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఏడాదే రిలీజైన రాధేశ్యామ్ ప్రభాస్ అభిమానులను నిరాశ పరచడంతో డార్లింగ్ నెక్ట్స్ మూవీ అయిన సలార్ కోసం ఎదురు చూస్తున్నారు. కాగా ప్రస్తుతం సలార్ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇకపోతే రామాయణ ఇతివృత్తం ఆధారంగా తెరకెక్కుతున్న ఆదిపురుష్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది.

ఇదిలా ఉంటే ప్రాజెక్ట్ కే సినిమా కూడా షూటింగ్ దశలో ఉంది. అయితే ఇలా వరుస భారీ సినిమాలతో దూసుకుపోతున్న ప్రభాస్ ఈ గ్యాప్ లో ఓ చిన్న సినిమాని ఓకే చేశాడు.
రొమాంటికి కామెడీ సినిమాలకు పెట్టింది పేరుగా ఉన్న దర్శకుడు మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ ఓ సినిమా చేయనున్నాడన్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ఇప్పుడే ప్రారంభం కాదులే అనుకుంటున్న అభిమానులకు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సినిమాను ప్రభాస్ మారుతి అప్పడే సెట్స్ పైకి తీసుకువచ్చారని.. షూటింగ్ కూడా మొదలైందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీకి రాజా డీలక్స్ పేరని కూడా కన్ఫార్మ్ చేశారని టాక్. కాగా ఈ సినిమాలో ప్రభాస్ సరసన ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారంటూ వార్తలు వెలువడుతున్నాయి. కానీ వీటన్నింటిపై చిత్ర బృందం నుంచి కానీ డార్లింగ్ ప్రభాస్ నుంచి కానీ ఇంకా ఎటువంటి అధికారిక సమాచారం రాలేదు. దానితో ఈ వార్తలని కొందరు ప్రేక్షకులు లైట్ తీసుకున్నా.. మరి కొంతమంది మాత్రం మారుతి లాంటి చిన్న డైరెక్టర్ తో సినిమా వద్దంటూ నెట్టింట ప్రభాస్ ను ట్రోల్ చేశారు.

ఇకపోతే తాజాగా మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న రాజాడీలక్స్ సినిమా సెట్ నుంచి రెండు ఫోటోలు లీక్ అయ్యాయి. ఈ రెండు ఫొటోల్లో ప్రభాస్ ఉన్నాడు. దానితో ఈ సినిమాలో డార్లింగ్ లుక్స్ కాస్త ఇప్పుడు వైరల్ గా మారాయి. ఒక ఫొటోలో ప్రభాస్ కూర్చొని ఉండగా పక్కనే మారుతి కూడా కూర్చొని సీన్ వివరిస్తున్నట్టుగా కనిపిస్తుంది. మరో ఫొటోలో ప్రభాస్ కుర్చీలో కూర్చుని ఫోన్ చూస్తూ కనిపిస్తాడు. ఈ పిక్స్ లీక్ అవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. నిజంగానే సినిమా మొదలుపెట్టి షూటింగ్ చేసేస్తున్నారా అంటూ షాక్ అయ్యారు. కాగా ఈ ఫొటోలో ప్రభాస్ లుక్ కాస్త కొత్తగా ఉండటంతో అభిమానులు సంతోషిస్తున్నారు. మరి ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందా అని వేయి కళ్లతో డార్లింగ్ ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు.

ఇదీ చదవండి: వీధికుక్కలను మీ ఇంటి ముందు పడేస్తే ఎలా ఉంటుంది?.. నాగార్జునపై నెటిజన్ ఫైర్

Exit mobile version