Site icon Prime9

OG: 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న “ఓజీ”.. రానున్న రోజులు మరింత ఎగ్జైటింగ్‌గా ఉండబోతున్నాయంటూ పోస్ట్

OG movie 3rd schedule wrap

OG movie 3rd schedule wrap

OG: వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ఉన్న నేపథ్యంలో ఈ సంవత్సరం చివరికల్లా చేతిలో ఉన్న సినిమాలు పూర్తిచేసి.. ప్రజల్లోనే ఉంటూ వారి సమస్యలు పరిష్కరించాలేలా కృషి చేయాలని ఫిక్స్ అయ్యారు పవన్ కళ్యాణ్. దానితో గత కొంత కాలంగా సినిమా షూటింగ్స్ లో తెగ బిజీగా ఉన్నాడు. సముద్రఖని దర్శకత్వంలో మామా మేనల్లుడు కలిసి నటిస్తోన్న వినోదయ సిత్తం రీమేక్ షూట్ పూర్తిచేసిన పవన్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా అంటూనే ఖాళీ దొరికినప్పుడల్లా ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలకు డేట్స్ ఇస్తూ ఆ షూటింగ్ పనులను శరవేగంగా పూర్తి చేస్తూ వస్తున్నాడు.

50 శాతం సినిమా షూటింగ్‌ పూర్తి(OG)

పవన్ కళ్యాణ్ కీలక పాత్రలో ఫ్యాన్ బాయ్ సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఓజి’ (వర్కింగ్‌ టైటిల్‌). ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏపీలో వారాహి విజయ యాత్రలో ఉన్నప్పటికీ ఆయన లేని సన్నివేశాలను, ఇతర తారాగణంతో ఉన్న కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. కాగా ఇటీవల హైదరాబాద్‌లో మొదలైన ఓజీ సినిమా మూడో షెడ్యూల్‌ ఆదివారంతో పూర్తయింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ సోషల్ మీడియా వేదకగా తెలిపింది. ‘దీనితో 50 శాతం సినిమా షూటింగ్‌ పూర్తయింది. రానున్న రోజులు మరింత ఎగ్జైటింగ్‌గా ఉండబోతున్నాయి’ అంటూ టీమ్‌ అంతా కలిసి దిగిన ఫొటోను ట్విట్టర్‌లో షేర్‌ చేసింది చిత్ర బృందం.

గ్యాంగ్‌స్టర్‌ బ్యాక్‌డ్రాప్‌లో తన అభిమాన హీరోతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దర్శకుడు సుజీత్‌ మరింత స్టైలిష్‌ మేకింగ్‌తో రూపొందిస్తున్నారు. పాత్రల విషయంలో ఎక్కడా కూడా కాంప్రమైజ్‌ కాకుండా నటీనటులను ఎంపిక చేసుకున్నారు. ప్రకాశ్‌రాజ్‌, శ్రియారెడ్డి, అర్జున్‌ దాస్‌, బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్‌ హస్మీ, హరీశ్‌ ఉత్తమన్‌ ఇలా భారీ బృందంతో ఈ మూవీని నిర్మిస్తున్నారు డి.వి.వి.దానయ్య. ఎప్పటికప్పుడు సినిమా అప్‌డేట్స్‌ ప్రేక్షకులకు తెలియజేస్తూ సినిమాపై మరింత అంచనాలు పెంచుతున్నారు సుజీత్. అంతే కాదు వచ్చే నెలలో తదుపరి షెడ్యూల్‌ ఉంటుందని తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాలో పవన్‌కల్యాణ్‌ సరసన ప్రియాంక ఆరుళ్‌ మోహన్‌ కథానాయికగా నటిస్తోంది.

Exit mobile version