Site icon Prime9

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ – సుజిత్ మూవీ ముహూర్తం డేట్ ఫిక్స్.. అసలు #OG అంటే అర్దం ఏంటంటే

pawan kalyan OG movie

pawan kalyan OG movie

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక వైపు సినిమాలు.. ఒకవైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.

సినిమాల విషయానికి వస్తే.. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ గా “హరిహర వీరమల్లు” రూపొందుతుంది.

హరీష్ శంకర్ డైరెక్షన్ లో ‘ఉస్తాద్ భగత్ సింగ్‘ కూడా చేస్తున్నారు.

ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా తమిళ తేరి చిత్రానికి రీమేక్ గా ఈ మూవీ వస్తుందని వార్తలు వస్తున్నాయి.

ఆ తర్వాత సముద్రఖని దర్శకత్వంలో ‘వినోదయ సీతమ్‘ అనే తమిళ సినిమా రీమేక్ చేస్తున్నారు. ఈ మూవీ లో సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తున్నారు.

అలానే  యంగ్ డైరెక్టర్ సుజిత్ తో కలిసి ఓ పాన్ ఇండియన్ మూవీ చేస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు.

ఈ సినిమా నుంచి అభిమానులకు తాజాగా మూవీ యూనిట్ ఓ గుడ్ న్యూస్ అందించింది.

 

ఈ సినిమా ఈ నెల (జనవరి) 30న లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. అదే రోజున ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రానున్నాయి.

హీరోయిన్, విలన్, ఇతర నటీనటులు, మ్యూజిక్ డైరెక్టర్, మిగతా టెక్నీషియన్స్ వివరాలు వెల్లడించనున్నారు.

గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రూపొందనుంది.

‘రన్ రాజా రన్’, ‘సాహో’ లాంటి సినిమాలను అంతకుముందు దర్శకుడు సుజీత్‌ తెరకెక్కించాడు.

ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై దానయ్య నిర్మిస్తున్నారు.

సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ పోస్ట‌ర్‌లో జ‌ప‌నీస్ లాంగ్వేజ్ ఉండ‌టంతో సినిమాపై అంద‌రికీ తెలియ‌ని ఓ క్యూరియ‌సిటీ క్రియేట్ అయ్యింది.

#OG అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా రూపొందుతుందది.

 

(Pawan Kalyan) #OG అంటే అసలు అర్దం ఏమిటి అంటే..

 

ఇటీవల న్యూ ఇయర్ కానుకగా ఈ సినిమా పోస్టర్ ని రిలీజ్ చేశారు.

ఆ పోస్టర్ లో They Call Him #OG అని వుంది.

ఇక్కడ ఓజీ అంటే ఒరిజినల్‌ గ్యాంగ్‌స్టర్‌.. అని ఈ ట్యాగ్‌ లైన్‌ చెబుతోంది.

అలాగే ఆ పోస్టర్‌లో పవన్‌ ఫొటోపై రాసి ఉన్న భాష  జపానీస్‌. ఆ భాషలో జపానీస్ లో అగ్నితుఫాన్‌ వస్తోంది అని రాశి ఉంది.

అదే విధంగా పవన్‌ కళ్యాణ్(Pawan Kalyan) నీడలో గన్‌ కనిపిస్తుంది.

పవన్‌ ముందు ఉన్న వృత్తాకారం జపాన్‌ జాతీయ జెండాను గుర్తు చేస్తోంది.

అలాగే పోస్టర్‌లో ఒక వైపు విగ్రహం ఆకారం కనిపిస్తుంది. అది జపాన్‌ లోనే అత్యంత ఎత్తైన బుద్ధుడి విగ్రహం. ఇది ఆ దేశంలోని ఉషికు ప్రాంతంలో ఉంది.

పోస్టర్‌లో మరోవైపు మన దేశంలోని గేట్‌వే ఆఫ్‌ ఇండియా కనిపిస్తుంది.

అలాగే ఈ సినిమా కథ జపాన్‌, ముంబయి నేపథ్యంలో సాగే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇదొక గ్యాంగ్‌స్ట‌ర్ డ్రామా అని అంద‌రూ భావిస్తున్నారు.

 

 

ప్రభాస్ సాహో మూవీతో (Pawan Kalyan)లింక్..

తాజాగా ఈ చిత్రం నుంచి ఓ ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.

కథానుసారం ఈ సినిమాను పాటలు, ఫైట్స్‌ లేకుండా చిత్రీకరిస్తున్నారట.

ప్రభాస్ నటించిన సాహో సినిమాకి .. ఈ సినిమాకి లింక్ ఉందట.. ఈ సినిమాలో ప్రభాస్ కనిపిస్తారో లేదో సస్పెన్స్ గా చెబుతున్నారు.

ఆ మూవీ లోని పాత్రల గురించి అయితే ప్రస్తావిస్తారని టాక్ నడుస్తుంది.

హాలీవుడ్‌ ఫిల్మ్‌ అనుభూతిని అందించేలా మూవీ మేకింగ్‌ ఉండబోతున్నట్లు తెలుస్తున్నది.

ప్రభాస్‌ హీరోగా ‘సాహో’ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు సుజీత్‌.. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ఈ మూవీ చేస్తున్నాడు. దీంతో వీరి కాంబినేషన్‌ చిత్రం మీద అంచనాలున్నాయి.

ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ప‌వ‌న్ ఇలాంటి సినిమా చేయ‌ట‌మ‌నేది నిజంగా ఎక్స్‌పెరిమెంట్ అనే చెప్పాలి.

ఈ వార్త‌లలో ఎంత వ‌ర‌కు నిజాలున్నాయో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version