Site icon Prime9

Mahesh Babu: మహేష్, త్రివిక్రమ్ సినిమా.. టైటిల్ ఇదే..!

SSMB28 movie title

SSMB28 movie title

Tollywood: సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్‌ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రం ఇటీవల షూటింగ్ ప్రారంభించుకున్న విషయం తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ ఆధ్వర్యంలో ఎస్. రాధాకృష్ణ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ సినిమా టైటిల్ పై అనేక రూమర్లు వైరల్ అయిన విషయం విదితమే. ముఖ్యంగా షూటింగ్ మొదలైన రోజు మేకర్స్ #SSMB28Aarambham అంటూ ఓ ట్యాగ్‌ని రిలీజ్ చెయ్యడంతో చాలా మంది ఆ సినిమాకు ‘ఆరంభం’ అనేది టైటిల్ అంటూ నెట్టింట ‘ఆరంభం’ ట్యాగ్ ని తెగ ట్రెండ్ చేశారు. కానీ మేకర్స్ మాత్రం దీనిపై ఎటువంటి వివరణ ఇవ్వలేదు.

కాగా తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ పవర్ ఫుల్ టైటిల్ నెట్టింట వైరల్ అవుతుంది. అటు త్రివిక్రమ్, ఇటు మహేష్ బాబు సెంటిమెంట్ కలగలిసేలా ‘అయోధ్యలో అర్జునుడు’ అనే ఈ టైటిల్ ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. దీనిలో త్రివిక్రమ్ సెంటిమెంట్ అయినటువంటి మొదటి అక్షరం ‘అ’, మహేష్ బాబు సెంటిమెంట్ అయినటువంటి చివరి అక్షరం ‘డు’ (రాజకుమారుడు, అతడు, ఒక్కడు, దూకుడు, సైనికుడు, ఆగడు, శ్రీమంతుడు) రెండూ ఉండటంతో మ్యాగ్జిమమ్ ఇదే టైటిల్ కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా సినీ పరిశ్రమలో మరియు అభిమానుల్లో గట్టి టాక్ నడుస్తుంది. మరి దీనికి సంబంధించి వాస్తవమేంటో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చెయ్యాల్సిందే.

ఇదీ చదవండి: నెట్టింట బాలయ్య సందడి.. NBK107 షూటింగ్ వీడియో వైరల్

Exit mobile version