Site icon Prime9

Nandamuri Mokshagna: లవ్ స్టోరీతో ఎంట్రీ ఇస్తున్న బాలయ్య తనయుడు

Nandamuri-Mokshagna

Tollywood: నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తెరంగేట్రం పై గత కొన్నాళ్లుగా పుకార్లు వినిపిస్తున్నాయి. బోయపాటి శ్రీను, క్రిష్ వంటి దర్శకుల పేర్లు ఊహాగానాలు జరిగాయి. కానీ ఏ ఒక్కటీ కన్ ఫర్మ్ కాలేదు. ఇప్పుడు అతని అరంగేట్రం గురించి మరలా వార్తలు వచ్చాయి.

తాజా సమాచారం ప్రకారం శ్యామ్ సింఘ రాయ్ ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో మోక్షజ్ఞ టాలీవుడ్ రంగ ప్రవేశం చేయనున్నాడు. లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం కానుందని సమాచారం. బాలకృష్ణ గోపీచంద్ మలినేని సినిమా షూటింగ్‌లో ప్రస్తుతం టర్కీలో ఉన్న విషయం తెలిసిందే. మోక్షజ్ఞ టర్కీలోనే తన కుటుంబంతో కలిసి ఇటీవల తన పుట్టినరోజును జరుపుకున్నాడు.

మోక్షజ్ఞ ఓ లవ్ స్టోరీని ఎంచుకున్నారని, ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని సమాచారం. టర్కీలో ఉన్న రాహుల్ మోక్షజ్ఞ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. అన్నీ కుదిరితే మోక్షజ్ఞ తొలి చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.

Exit mobile version