Site icon Prime9

#NC22: చైతూ 22వ సినిమా పేరు రివీల్.. పోస్టర్ రిలీజ్

naga Chaitanya #NC22 movie title custody-and movie poster-released

naga Chaitanya #NC22 movie title custody-and movie poster-released

#NC22: నాగచైతన్య హీరోగా తాజాగా తెరకెక్కుతున్న మూవీ #NC22 ఈ మూవీని వెంకట్ ప్రభు రూపొందిస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో నిర్మితమవుతోన్న ఈ సినిమాకు శ్రీనివాస చిట్టూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అయితే ఇప్పటి వరకు #NC22 పేరిట రూపొందుతున్న ఈ సినిమాకు టైటిల్ ను రివీల్ చేశారు చిత్ర బృందం. అదే విధంగా కొంతసేపటి క్రితం టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

ఈ సినిమాకి ‘కస్టడీ’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను చిత్రబృందం విడుదల చేశారు. పోలీస్ అధికారులు హీరోను చుట్టుముట్టి కస్టడీలోకి తీసుకుంటున్నట్టుగా పోస్టర్ లో కనిపిస్తోంది. అయితే హీరో కూడా పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తూ ఉండటమే విశేషం. ఇకపోతే ఈ మూవీలో కథానాయికగా కృతి శెట్టి అలరించనుంది. అరవింద్ స్వామి, శరత్ కుమార్, ప్రియమణి ఇతర ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.


ఇదీ చదవండి: శంకరాభరణం సినిమాకు అరుదైన గౌరవం

Exit mobile version