Site icon Prime9

Naga Sourya: పెళ్లిపీటలెక్కబోతున్న టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య.. వధువు ఎవరో తెలుసా..?

naga-shaurya-going-get-married

naga-shaurya-going-get-married

Naga Sourya: టాలీవుడ్‌ యంగ్‌ హీరో నాగశౌర్య త్వరలోనే ఓ ఇంటివాడు అవనున్నాడు. ఈ నెల 20న బెంగళూరులో అనూష అనే యువతితో ఏడడుగులు వేయనున్నాడు ఈ స్మార్ హీరో. నవంబర్‌ 20న బెంగుళూరులో వీరి వివాహం జరుగనుంది. కాగా నవంబర్‌ 19న మెహందీ ఫంక్షన్‌ ఉండటంతో ఇప్పటికే నాగశౌర్య ఇంట పెళ్లి సందడి మొదలైంది.

ఇప్పటికే నాగశౌర్య ఇంటి సభ్యులు శుభలేఖలు కూడా పంచుతున్నారు. పెళ్ళికి భారతీయ సాంప్రదాయ దుస్తుల్లో రావాల్సిందిగా నాగశౌర్య ఫ్యామిలీ ఆహ్వానితులను కోరుతోంది. కాగా నవంబర్‌ 20న ఉదయం 11.25 గంటలకి నాగశౌర్య అనుషల వివాహం సంప్రదాయబద్ధంగా జరుగనుంది. ఇకపోతే నాగశౌర్య వివాహం జరగబోతున్న సంగతి బయటికి రావడంతో ఆయన అభిమానులు తెగ సంబరాలు చేసుకుంటున్నారు. నెట్టింట ఈ యంగ్ హీరోకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే మరోవైపు వీరిది ప్రేమ వివాహమా? లేక పెద్దలు కుదిరించిన వివాహమా? అనే విషయంపై గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇక సినిమాల విషయానికొస్తే ఇటీవల నాగశౌర్య, అరుణాచలం దర్శకత్వంలో తన 24వ సినిమాను ప్రారంభించాడు. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాని వైష్ణవి ఫిలిమ్స్ మీద శ్రీనివాసరావు, విజయ్ కుమార్, అరుణ్ కుమార్ సంయుక్తంగా నిర్మించనున్నారు. ప్రస్తుతానికి ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

ఇదీ చదవండి: అర్జున్‌ కపూర్‌తో పెళ్లికి ఓకే చెప్పిన మలైకాఅరోరా.. హాట్‌ టాపిక్‌గా మారిన ఇన్‌స్టా పోస్ట్‌

Exit mobile version