Site icon Prime9

Manchu Vishnu: మంచు విష్ణు స్ట్రాంగ్ వార్నింగ్!

manchu vishnu tweet on prabas prime9news

manchu vishnu tweet on prabas prime9news

Tollywood: హైదరాబాదులోని దసపల్లా హోటల్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు మీడియా సమావేశం నిర్వహించగా, ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికై అక్టోబర్ 13 నాటికి ఏడాది పూర్తి ఐనా సందర్భంగా ఈ మీడియా సమావేశం నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఇక ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మంచు మోహన్ బాబు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ 2021 మా ఎన్నికలు తలపించాయని అనంతరం అక్టోబర్ 13 న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నానని మంచు విష్ణు వెల్లడించారు.

“మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ” కు వ్యతిరేకంగా ఎవరైనా పోస్టులు పెట్టిన వారు అనర్హతకు గురి అవుతారని వెల్లడించారు. ఇక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ క్రమశిక్షణ కమిటీ సభ్యులుగా మోహన్ బాబు, గిరిబాబు, జయసుధ, స్వప్నదత్ వ్యవహరిస్తారని, ఇక గతంలో ఈ పదవికి చిరంజీవి రాజీనామా చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. అలాగే మంచు విష్ణు మాట్లాడుతూ రెండు సినిమాల్లో నటించి విడుదలైన వారికి ‘మా’లో శాశ్వత సభ్యత్వం కల్పిస్తామని, అలాగే కనీసం 5 నిమిషాలు సినిమాలో కనిపించి డైలాగ్ చెప్పే విధంగా అసోసియేట్ నుంచి సభ్యత్వం కల్పిస్తామని ఐతే అసోసియేట్ గా ఉన్నవారికి ‘మా’లో ఓటు హక్కు ఉండదని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.

Exit mobile version