Site icon Prime9

Allu Arjun: తొలి దక్షిణాది హీరోగా బన్నీ అరుదైన ఘనత.. అల్లుఅర్జున్ ఫ్యాన్స్ ఖుషీ

leading-man-of-the-year-gq-moty-2022 award goes to Allu Arjun

leading-man-of-the-year-gq-moty-2022 award goes to Allu Arjun

Allu Arjun: టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ గా పేరుగాంచిన అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ యంగ్ డైనమిక్ హీరో క్రేజ్ ‘పుష్ప’ సినిమాతో ఖండాంతరాలు దాటింది.
సౌత్‌, నార్త్‌ అని తేడాలేకుండా ప్రస్తుతం ఎక్కడ చూసిన బన్నీ హవానే కనిపిస్తుంది. ప్రతి చోట ఈ హీరో పేరు మార్మోగిపోతోంది. అవార్డు ఫంక్షన్‌ ఏదైనా సరే అందులో బన్నీ పేరు కచ్చితంగా వినబడుతుంది. పుష్ప రాజ్‌గా బన్నీ నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇక దీనితో అల్లుఅర్జున్ నటనకు ఇప్పటికే పలు అవార్డులు వరించగా.. ఇప్పుడు తాజా బన్నీ మరో అత్యున్నత అవార్డును అందుకున్నాడు.

తాజాగా అల్లుఅర్జున్‌ ప్రతిష్టత్మక GQ MOTY-2022 ‘లీడింగ్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డును కైవసం చేసుకున్నాడు. ఈ అవార్డును గెలుపొందిన తొలి తెలుగు హీరో బన్నీనే కావడం విశేషం.
ఈ అవార్డు రావడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్‌ తెగ సంతోషపడుతున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ ఇండియన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డును అందుకున్న తొలి దక్షిణాది హీరోగా అరుదైన ఘనత సాధించాడు. అంతేకాక ఫిలింఫేర్‌, సైమా వంటి అత్యున్నత అవార్డులు సైతం ఈయనను వరించాయి.

ఇదీ చదవండి: ప్రభాస్ చిత్రంలో రామ్ గోపాల్ వర్మ

Exit mobile version