Keeravani: దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన “ఆర్ఆర్ఆర్” సినిమాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించారు. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకున్న ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించింది. కేవలం భారత్ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా ఈ సినిమాకి బ్రహ్మరధం పడుతున్నారు. అలానే ఈ చిత్రానికి అంతర్జాతీయ స్థాయిలో అవార్డులను కైవసం చేసుకుంటుంది. న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ నుంచి ఇటీవలే బెస్ట్ డైరెక్టర్‌గా ఆర్ఆర్ఆర్ మూవీకి రాజమౌళి అందుకున్నారు. తాజాగా ఈ సినిమా మరోసారి చరిత్రను తిరగరాసింది.
గోల్డెన్ గ్లోబ్ అవార్డ్.. ఆర్ఆర్ఆర్ టీంకి అభినందల వెల్లువ
ఈ చిత్రం ఆస్కార్ తర్వాత అత్యంత ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డుని అందుకుంది. ఈ సినిమాలోని నాటు నాటు పాటకి గాను బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డుని ఈ పాట సంగీత దర్శకుడు కీరవాణి అందుకున్నారు. దీంతో మూవీ టీంని అభినందిస్తూ పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతున్నారు. ఇప్పటికే ఏఆర్ రెహమాన్, మెగాస్టార్ చిరంజీవి, కళ్యాణ్ రామ్, అజయ్ దేవగన్.. పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా టీంకి అభినందనలు చెప్పారు. అలానే ఈ అవార్డు అందుకున్న తర్వాత కీరవాణి మాట్లాడుతూ ఎమోషనల్ అవ్వడం గమనించవచ్చు.
కీరవాణి మాట్లాడుతూ… ఈ అవార్డు నాకు అందించిన హెచ్ఎఫ్పీఏకి ధన్యవాదాలు. నాకు ప్రతి విషయంలో తోడున్నందుకు ముందుగా నా భార్య శ్రీవల్లికి థ్యాంక్స్ చెప్పాలి. అలానే ఈ అవార్డు నిజంగా దక్కాల్సినది ఈ సినిమా డైరెక్టర్, నా బ్రదర్ రాజమౌళికి అని చెప్తూ కీరవాణి ఎమోషనల్ అయ్యారు. అదే విధంగా ఈ పాటకి అద్భుతమైన డ్యాన్స్ స్టెప్స్ సమకూర్చిన ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కి, సాహిత్యం అందించిన చంద్రబోస్ గారికి, ఈ పాట పడిన రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవకి థాంక్స్ అన్నారు. అలానే ముఖ్యంగా అద్భుతంగా డ్యాన్స్ చేసిన ఎన్టీఆర్, రామ్ చరణ్ కి అలాగే ఈ సాంగ్ కి ప్రోగ్రామింగ్ చేసిన సాలు సిద్దార్థ్, జీవన్ బాబులకి అలాగే మరోసారి శ్రీవల్లికి అందరికి ధన్యవాదాలు అని అన్నారు. ప్రస్తుతం ఈ స్పీచ్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
MM Keeravaani’s #GoldenGlobes2023 acceptance Speech!! ❤️🔥❤️🔥 #RRRMovie #NaatuNaatu pic.twitter.com/9q7DY7Pn5G
— RRR Movie (@RRRMovie) January 11, 2023
ఇవి కూడా చదవండి
Ram Charan-Upasana: సైలెంట్‌గా ఉపాసన ఎంట్రీ.. భార్యను రాంచరణ్ ఎలా పరిచయం చేశాడో చూడండి..
RRR : గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో సత్తా చాటిన ఆర్ఆర్ఆర్.. బెస్ట్ సాంగ్ గా “నాటు నాటు”
Bangalore: 50 మందికిపైగా ప్రయాణికులను వదిలేసిన విమానం.. ఎక్కడో తెలుసా?
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: http://Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/