Site icon Prime9

Vijay Devarakonda: సమంతను ఎంతగానో ఇష్టపడ్డాను.. విజ‌య్ దేవ‌ర‌కొండ

Vijay Devarakonda

Vijay Devarakonda

Tollywood: కాలేజీ రోజుల్లో సమంతను మొట్టమొదటిసారిగా స్క్రీన్ పై చూసినపుడే ఆమె అభిమానిగా మారిపోయానని రౌడీ హీరో విజయ్ దేవరకొండ అన్నారు. స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన తాజా చిత్రం `య‌శోద‌`. తెలుగులో ఈ సినిమా ట్రైల‌ర్‌ను విజ‌య్ దేవ‌ర‌కొండ విడుద‌ల చేశారు.

ఈ సందర్బంగా విజయ్ మాట్లాడుతూ కాలేజీ రోజుల్లోనే సమంతతో ప్రేమలో పడిపోయాను. సమంత ఏం చేసినా నేను ఆమెను అభినందిస్తున్నాను మరియు ఆరాధిస్తాను` అంటూ స‌మంత‌ పై త‌న అభిమానాన్ని చాటుకున్నాడు. య‌శోద ట్రైల‌ర్‌ను మీ అందరితో పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని విజ‌య్ దేవ‌ర‌కొండ పేర్కొన్నారు.

హరి-హరీష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `య‌శోద‌ చిత్రాన్ని శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించారు. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుంద‌న్‌, రావు రమేశ్, మురళీ శర్మ, సంపత్ రాజ్ తదితరులు కీలక పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. ఈ చిత్రం న‌వంబ‌ర్ 11న తెలుగుతో పాటు త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ మ‌రియు హిందీ భాష‌ల్లో విడుద‌ల‌వుతోంది. స‌మంత‌-విజ‌య్ దేవ‌ర‌కొండ జంట‌గా ప్ర‌స్తుతం `ఖుషి` అనే మూవీలో నటిస్తున్నారు.

Exit mobile version