Site icon Prime9

Jr NTR: ఆర్ఆర్ఆర్ సినిమాలోకి సింహాద్రి ఎలా వచ్చాడు ?

ntr prime9news

ntr prime9news

Tollywood: జూనియర్ ఎన్టీఆర్ సినీ కెరీయర్లో సింహాద్రి సినిమా చాలా స్పెషల్. ఎందుకంటే ఈ సినిమా ఎంత పెద్ద హిట్ కొట్టిందో మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా కథ ఏంటంటే ప్రజలు చల్లగా బ్రతకడం కోసం ఒకర్ని చంపడానికైనా చావడానికైనా నేను సిద్ధమే అంటూ పవర్ఫుల్ ఎమోషనల్ కథ చిత్రీకరంచి తెలుగు ప్రేక్షకుల మనసులను  గెలుచుకుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జతగా భూమిక, అంకిత కథానాయికలుగా నటించారు. ఈ సినిమాలో ఒక్క పాటని కాదు అన్ని పాటలు డబుల్ సూపర్ హిట్‌గా నిలిచాయి. ఈ సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహించారు. అప్పటిలోనే ఈ సినిమా రూ 9 కోట్లతో ఈ సినిమాను నిర్మించారు. బాక్స్ ఆఫీసు కలెక్షన్స్ రూ 29 కోట్లు కలెక్ట్ చేసి బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ గా నిలిచింది ఈ సినిమా.

చిన్న వయసులోనే ఆ సినిమాతో ఎన్టీఆర్ ఎన్నో రికార్డులను బద్దలు కొట్టాడు. సింహాద్రి సినిమాలో సింగమలైగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.ఆ పాత్ర ఎన్టీఆర్ అభిమానులకు ఎప్పటికి గుర్తు ఉండిపోతుంది. ఎన్టీఆర్ కెరీయర్లో సింగమలై పవర్ఫుల్ పాత్ర అని చెప్పవచ్చు. సోషల్ మీడియాలో తారక్ నటించిన RRR సినిమాలోని పాటకు సింహాద్రి సినిమాలోని ‘ సింగమలై ‘ లిరిక్స్ ను మిక్స్ చేసి బయటికి వదిలారు. ఇప్పుడు ఈ పాట సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. RRR సినిమాలో సీన్లకు” సింగమలై ” లిరిక్స్  బాగా సెట్ అయ్యాయి.

Exit mobile version