Site icon Prime9

HariHaraVeeraMallu: పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’అప్డేట్ వచ్చేసింది.

Harihara veeramallu_workshop

#Hariharaveeramallu: తెలుగు చలన చిత్రసీమలో అగ్ర కధా నాయకుల నడుమ విభన్న కధలతో, సాహస చిత్రాల దర్శకుడిగా పేరొందిన క్రిష్ జాగర్లమూడి మరో భారీ సినిమా హరిహరవీరమల్లు సినిమా షూటింగ్ వర్క్ షాపు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. దసరా శుభాకాంక్షలతో ప్రారంభమైన ఈ సినిమాలో హీరోగా తెలుగు ప్రజల హృదయాల్లో తన నటనాభినయంతో ప్రత్యేక స్థానాన్ని నింపుకొని, పవర్ స్టార్ గా అలరిస్తున్న పవన్ కళ్యాణ్ తన అభిమాన ప్రేక్షకుల గుండెల్లో నిలచిపోయే చిత్రాన్ని అందించేందుకు రెడీ అయ్యారు.

నేటి సినిమా ప్రపంచంలో స్వర సంగీతమే పరమావధిగా భావించే మాంత్రికుల్లో ఒకరై, బాహుబలి, ఆర్ఆర్ఆర్ పాన్ ఇండియాలో ప్రత్యే స్థానాన్ని అందుకొన్న ఎం.ఎం. కీరవాణి హరిహరవీరమల్లు చిత్రానికి తన సుమధుర బాణిని అందిస్తున్నారు. ప్రీ షెడ్యూల్ వర్క్ షాపులో పవన్ కళ్యాణ్ తో పాటు కధానాయకురాలుగా నిధి అగర్వాల్, సునీల్, సుబ్బరాజు, రఘుబాబు, బుల్లితెర హస్యనటుడు, రచయిత హైపర్ ఆది, నిర్మాత ఎ. దయాకర్ రావులు, చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

లాంఛనంగా ప్రారంభమైన సినిమా షూటింగ్ అక్టోబర్ మూడవ వారం నుండి రెగ్యులర్ షూటింగ్ గా జరుపుకోనుంది. మెగా సూర్య ప్రొడక్షన్ ఆఫీసులో చేపట్టిన వర్క్ షాపులో పవన్ కళ్యాణ్ ఎరుపు రంగు టీ షర్ట్, డెనిమ్ జీన్స్ ప్యాంట్ లో హ్యాండ్ సం లుక్ తో స్టైలిష్ గా కనిపించాడు. అభిమానులకు ఆయన ఎప్పుడూ ట్రెండీ లుక్ తో ఉన్న వస్త్రధారణలో ఎక్కువగా కనపడరు. ఎందుకంటే తన ట్రేడ్ మార్క్ వైట్ రంగును పవన్ కళ్యాణ్ అన్ని సమయాల్లో ఇష్టపడతాడు. కాని హరిహరవీరమల్లు వర్క్ షాపులో పవన్ భిన్నంగా ప్రేక్షుకుల మనసును కొల్లగొట్టాడు. యాక్షన్-సాహసం మాటున హరిహరవీరమల్లు చిత్రం నిజమైన సంఘటనల ఆధారంగా ఉండేలా కధను తీర్చిదిద్దారు. ఏఎం రత్నం సమర్పణలో షూటింగ్ కు శ్రీకారం చుట్టిన ఈ చిత్రానికి విఎస్ జ్నానశేఖర్ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Renu Desai: 18 ఏళ్ల తరువాత పెద్ద తెరపైకి రేణూ దేశాయ్

Exit mobile version