Site icon Prime9

Hari Hara Veeramallu: రామోజీ ఫిలింసిటీలో హరిహరవీరమల్లు చిత్ర షూటింగ్!

Hariharaveeramallu film shooting at Ramoji Filmcity!

Tollywood: క్రిష్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా తెరపైకి ఎక్కిస్తున్న హరిహరవీరమల్లు చిత్ర షూటింగ్ హైదరాబాదు రామోజీ ఫిలింసిటీలో ఫైట్ సీక్వెన్స్ ను ఎక్కిస్తున్నారు. క్రిష్, పవన్ టీం ఇటీవలే వర్క్ షాపులో కూడా పాల్గొన్నారు. సెట్స్ పైకి ఎక్కిన ఈ సినిమా షూటింగ్ తొలినుండి అభిమానుల్లో ఆసక్తిని రేపుతోంది.

గుర్రాలతో సాగే ఓ పోరాట ఘట్టాన్ని చిత్రీకరిస్తున్నారు. పవన్‌ డూప్‌తో ఈ యాక్షన్‌ ఎపిసోడ్‌ చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. పవన్‌ తర్వాత సెట్స్‌ లో జాయిన్ కానుండగా, పవన్‌ క్లోజప్‌ షాట్స్‌ క్రిష్ తీయబోతున్నాడని ఇన్‌సైడ్‌ టాక్‌ హీటెక్కిస్తుంది. ఎ.ఎం. రత్నం, ఎం. దయాకర్ రావులు నిర్మిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కధానాయికగా నటిస్తోంది. బాలీవుడ్ యాక్టర్లు అర్జున్ రాంపాల్‌, న‌ర్గీస్ ఫ‌క్రీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఎంఎం కీర‌వాణి మ్యూజిక్ డైరెక్టర్‌‌. ఇప్పటికే విడుద‌లైన హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు పోస్టర్లు, గ్లింప్స్ వీడియోలు సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. పీరియాడిక్ యాక్షన్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఇదివ‌ర‌కెన్నడూ క‌నిపించ‌ని పాత్రలో సంద‌డి చేయ‌బోతున్నాడు. ఈ చిత్రాన్ని 2023 ఏప్రిల్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు టాక్‌.

ఇది కూడా చదవండి: Jn NTR: బెంగళూరులో జూనియర్ ఎన్టీఆర్..ట్రెండింగ్ లో ఫోటోలు

Exit mobile version