Site icon Prime9

Keerthy suresh: ’దసరా‘ ఫస్ట్ లుక్: పెళ్లి కూతురుగా కీర్తి సురేష్

keerthy-suresh

keerthy-suresh

Tollywood: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ’దసరా‘. ఇది 2023 వేసవిలో విడుదల కానుంది. తెలంగాణ నేపథ్యంలో సాగే ఈ లవ్ స్టోరీలో నాని డీగ్లామర్ పాత్రను పోషిస్తున్నాడు. కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. సోమవారం ఆమె పుట్టినరోజును పురస్కరించుకుని మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.

ఈ చిత్రంలో కీర్తి సురేష్ వెన్నెల పాత్రను పోషిస్తోంది. పోస్టర్ లో కీర్తి పెళ్లి కూతురు గెటప్ లో ఉంది. పసుపుచీర ధరించి ఉల్లాసంగా కనిపిస్తోంది. హైదరాబాద్‌లో ఈ సినిమా కోసం భారీ సెట్‌ని నిర్మించారు. సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల దర్శకుడు. సంతోష్ నారాయణన్ సంగీతం సమకూరుస్తున్నారు. దసరా నాని కెరీర్‌లో అత్యంత భారీ వ్యయంతో నిర్మించిన చిత్రం. ఈ చిత్రానికి సంబంధించి థియేటర్, నాన్-థియేట్రికల్ డీల్స్ అన్నీ క్లోజ్ అయ్యాయి.

ఎస్ఎల్ వి సినిమాస్ దసరా నిర్మాతలు. మొదటి సింగిల్ చాలా రోజుల పాటు ట్రెండింగ్‌లో ఉంది. ఈ ఏడాది చివరి నాటికి దసరా షూటింగ్ పార్ట్‌లు పూర్తవుతాయి. దసరా 30 మార్చి 2023న పాన్ ఇండియా విడుదలకు షెడ్యూల్ చేయబడింది.

Exit mobile version