Site icon Prime9

Samantha: సమంతకు నిజంగా ఆ ఆరోగ్య సమస్య ఉందా ?

samantha prime9news

samantha prime9news

Tollywood: నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తరువాత నుంచి సమంతా మీద ఎన్నో రుమార్లు వస్తున్నాయి. కానీ ఈ అమ్మడు మాత్రం ఒక్క డానికి కూడా సమాధానం చెప్పకుండా తన పని తాను సంతోషంగా చేసుకుంటుంది. ఈ రుమార్లు నాకు కొత్తేమీ కాదు నాకు ఇవి చాలా కామన్ అంటూ సిల్లిగా తీసుకొని వదిలేసింది.

ప్ర‌స్తుతం స‌మంత బాలీవుడ్లో న‌టించ‌టానికి సిద్దంగా ఉందని అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు సమంతా వేసే అడుగులు టాలీవుడ్ ఒక్కటే కాదు బాలివుడ్ కూడా ఉంది. వ‌రుణ్ ధావ‌న్‌ తో క‌లిసి ఒక వెబ్ సిరీస్‌లో నటించనుంది. దీని కోసం ఈమె మార్ష‌ల్ ఆర్ట్స్ కూడా నేర్చుకోబోతున్నట్టు తెలిసిన సమాచారం. ఆయుష్మాన్ ఖురానాతో కూడా ఒక సినిమా చేయబోతుంది. దీని కోసం పలు కొత్త వ‌ర్క్ షాప్స్‌ కు వెళ్తున్నట్టు తెలిసిన సమాచారం. ఈ సినిమాలో మొదటి సారి స‌మంత రెండు పాత్రల్లో నటిస్తున్నారని తెలుస్తుంది. ఆ సినిమాలో ఒక పాత్ర రాణిగా ఇంకో పాత్ర ఆత్మ‌గా నటించనున్నారు. ప్రస్తుతం స‌మంత చేస్తున్న రెండు పాన్ ఇండియా సినిమాలు శాకుంతంలం, య‌శోద సినిమాలు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ పనులు జరుగుతున్నాయి.

ప్రస్తుతం స‌మంత మీద ఓ వార్తా సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. ఆ వార్తా ఏంటంటే కొంత కాలం నుంచి చ‌ర్మ సమస్యల వాళ్ళ బాగా ఇబ్బంది ప‌డుతుంద‌ని, అందుకే ఆమె అసలు బ‌య‌ట‌కు రావ‌టం లేద‌ని గుస గుసలు వినిపిస్తున్నాయి. ఈ రూమర్స్ గురించి తెలుకున్న స‌మంత ప‌ర్స‌న‌ల్ మేనేజ‌ర్ వెంటనే ఈ ప్రశ్నలకు చెక్ పెట్టారు. తనను విమర్శించే వాళ్ళలో ‘కొంద‌రు కావాల‌నే ఆమె పై త‌ప్పుడు ప్రచారాలు చేస్తూ ఆమె పనికి ఆటంకం కలిగించాలని చూస్తున్నారని ఆయన వెల్లడించారు. సమంతా చాలా ఆరోగ్యంగా ఉన్నారు. స‌మంత‌ పై ఇలాంటి త‌ప్పుడు వార్త‌ల‌ను పుట్టిస్తున్న వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని సమంత ఆలోచిస్తుందని మేనేజర్, ఆయన మాటల్లో తెలిపారు.

Exit mobile version