Site icon Prime9

Prabhas: ఆ 16 మందినే ఫాలో అవుతున్న ప్రభాస్.. అందులో మేడమ్ కూడా ఉందా..?

Do you know who Prabas is following on Instagram?

 Prabhas: పాన్ ఇండియా స్టార్, టాలీవుడ్ హీరో డార్లింగ్ ప్రభాస్ కు ఉన్న ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. హీరోగా కన్నా తన వ్యక్తిత్వంతో ఎక్కువ క్రేజ్ పొందారు ప్రభాస్. అభిమానులను అతను చూసుకునే విధానం, ఫ్యాన్స్ అతనిపై చూపించే ప్రేమ… నెక్ట్స్ లెవల్ అంతే. తెలుగు సినీ పరిశ్రమను పాన్ ఇండియా లెవల్ కు తీసుకెళ్లిన హీరో ప్రభాస్. అయినా కూడా అతనిలో కొంచెం కూడా మార్పు లేదు అంతే సిగ్గు బిడియం మొహమాటంతో ఎంత ఎదిగినా ఒదిగే ఉండాలంటూ ఒబీడియంట్ గా కనిపిస్తుంటారు డార్లింగ్. మరి తాజాగా బాలయ్య హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ ఎపిసోడ్‌కి గెస్ట్‌గా వచ్చాడు డార్లింగ్ ప్రభాస్. ఇంక ఈ ఎపిసోడ్ చూడడం కోసం ఆహా సైట్ క్రాస్ అయిందంటేనే అర్థం చేసుకోవచ్చు అతని ఫాలోయింగ్ ఏంటనేది. డార్లింగ్ ఫ్యాన్స్ తాకిడికి అన్ స్టాపబుల్ షో రికార్డులన్నీ బద్దలయ్యాయనే చెప్పవచ్చు.

ఇక సోషల్ మీడియాలో చాలా రేర్‌గా పోస్టులు పెట్టే ప్రభాస్‌కి ఫాలోవర్స్ మాత్రం వీరలెవల్ లో ఉన్నారు. ప్రభాస్ ను ఇన్ స్టాలో ఏకంగా 9 మిలియన్ల మంది అంటే 90 లక్షల మంది అనుసరిస్తున్నారు. అయితే ఇందులో ఇంట్రెస్టింగ్ విషయమేమిటంటే ప్రభాస్‌ మాత్రం కేవలం 16 మందిని మాత్రమే ఫాలో అవుతున్నాడు. మరి డార్లింగ్ ఫాలో అవుతున్న ఆ 16 మంది స్పెషల్ పర్సన్స్ ఎవరో తెలుసుకుందామా..

prabas unstoppable show

  1. దివంగత యాక్టర్ కృష్ణం రాజు
  2. సందీప్ రెడ్డి వంగ
  3. బాలీవుడ్ నటుడు సన్నీ సింగ్
  4. హీరోయిన్ క్రితీ సనన్
  5. ఫిల్మ్ యాక్షన్ యూనిట్ ఎడిటర్ DB బ్రాకమోంటెస్
  6. డైరెక్టర్ నాగ్ అశ్విన్
  7. డైరెక్టర్ రాధాకృష్ణ
  8. హీరోయిన్ శృతిహాసన్
  9. ప్రశాంత్ నీల్
  10. బాలీవుడ్ లెజెండ్ అమితాబ్
  11. డైరెక్టర్ ఓం రౌత్
  12. హీరోయిన్ దీపికా పదుకొనే
  13. నటి భాగ్య శ్రీ
  14. హీరోయిన్ పూజా హెగ్డే
  15. హీరోయిన్ శ్రద్ధా కపూర్
  16. డైరెక్టర్ సుజీత్

prabas unstoppable show

ఇందులో ఎక్కువ మంది ప్రభాస్ తన సినిమాలకు పని చేసిన క్యాస్ట్ అండ్ క్రూ పర్సన్స్ మాత్రమే ఉన్నారు. అనూహ్యంగా టాలీవుడ్ యంగ్ హీరోలు చరణ్, తారక్, బన్నీ లాంటి వారిని కూడా ప్రభాస్ ఫాలో అవ్వకపోవడం గమనార్హం. ఇకపోతే నిన్న విడుదలైన అన్ స్టాపబుల్ షోలో మాత్రం రాంచరణ్ తన క్లోజ్ ఫ్రెండ్ అని బాలయ్య బాబు రాం చరణ్ నుంచి డార్లింగ్ సీక్రెట్స్ రాబట్టడానికి ఫోన్ చేసి మరీ ప్రశ్నలు అడగడం చూశాము. కానీ ఇన్ స్టా లో చూస్తేమాత్రం రాం చరణ్ గోపీచంద్ వంటి తన ఫ్రెండ్స్ కూడా ఆయన ఫాలో అవడం లేదని తెలుస్తోంది. ఇకపోతే నిన్నటి ప్రభాస్ ఎపిసోడ్ లో రాణి, మేడం ప్రస్తావణ వచ్చింది. మరి ప్రభాస్ రాణి ఎవరు, మేడమ్ ని పెళ్లి చేసుంకుంటారా అనే ప్రశ్నలు ఫ్యాన్స్ లో ఉండగానే ఇన్ స్టాలో ప్రభాస్ ఫాలోవర్స్ ను చూస్తే మాత్రం అభిమానులు ఒకటి కన్ఫామ్ చేసుకుంటున్నారు. ప్రభాస్ మేడం కృతి సననే అని అనుకుంటున్నారు.

ఇదీ చదవండి: “ఇదే సరైన సమయమంటున్న” సమంత.. నెట్టింట వైరల్ అవుతున్న పోస్ట్

Exit mobile version