Site icon Prime9

#HariHaraVeeraMallu: హరిహరవీరమల్లు సెట్ లో హరీశ్ శంకర్.. పవన్ లుక్స్ కిర్రాక్

director harish-shankar-photo-with-pawan-kalyan-in-harihara-veeramallu-sets

director harish-shankar-photo-with-pawan-kalyan-in-harihara-veeramallu-sets

#HariHaraVeeraMallu: పవన్ కళ్యాణ్ అటు సినిమాలు, ఇటు రాజకీయాలతో ఫుల్ బిజీబిజీగా ఉన్నారు. రాజకీయాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వల్ల సినిమాలని చాలా స్లోగా చేస్తున్నాడు. ప్రస్తుతం పవన్, క్రిష్ జాగర్లమూడీ దర్శకత్వంలో పీరియడ్ యాక్షన్ డ్రామాగా హరిహరవీరమల్లు చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ మూవీ గురించి అప్పుడప్పుడు క్రేజీ అప్డేట్స్ ఇస్తూ అభిమానులను ఖుషీ చేస్తుంది చిత్ర బృందం. అయితే తాజాగా హరిహరవీరమల్లు సెట్స్ లో పవన్ కళ్యాణ్ ను  డైరక్టర్ హరీష్ శంకర్ మీట్ అయ్యారు. ఆ ఫొటోలను హరీష్ నెట్టింట షేర్ చెయ్యడంతో అవి కాస్త ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

రెండేళ్ల క్రితం మొదలైన హరిహర వీరమల్లు సినిమా కరోనా కారణంగా మరియు పవన్ రాజకీయ షెడ్యూల్స్ వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. కాగా ఇటీవలే ఈ సినిమా వర్క్ షాప్ జరుపగా ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఏడాది సమ్మర్ కి రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోన్నట్టు తెలుస్తోంది. దానితో ఇన్నాళ్లు నత్తనడకన సాగిన షూటింగ్ రెండు వారాల నుంచి శరవేగంగా పరిగెడుతుంది. ఇప్పటికే సినిమా సెట్స్ నుంచి కొన్ని వర్కింగ్ స్టిల్స్ ను చిత్ర యూనిట్ షేర్ చెయ్యగా వాటికి పవన్ అభిమానులు ఖుషీ అయ్యారు. ఇకపోతే తాజాగా గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా హరిహర వీరమల్లు సెట్ కి వెళ్లారు. సెట్ లో పవన్ కళ్యాణ్ మరియు చిత్ర యూనిట్ ని కలిశారు. సెట్స్ లో పవన్ తో గ్రేట్ టైమ్ గడిపినట్లు ఆయన పేర్కొన్నారు. డైరెక్టర్ క్రిష్ కి థాంక్స్ తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు.

పవన్ కళ్యాణ్ తో హరీశ్ శంకర్ గబ్బర్ సింగ్ తర్వాత మరొక బ్లాక్ బస్టర్ ను ఇచ్చేందుకకు సిద్ధం అవుతున్నారు. ఈ కాంబినేషన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇదీ చదవండి: నన్ను ఈ చొక్కా అయినా వేసుకోనిస్తారా వైసీపీ?.. వారాహి కలర్ పై స్పందించిన పవన్

Exit mobile version