Site icon Prime9

Karthikeya: కార్తికేయ “బెదురులెంక” మోషన్ పోస్టర్ రిలీజ్

hero karthikeya bedurulanka movie update

hero karthikeya bedurulanka movie update

Karthikeya: హీరో కార్తికేయ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది ‘ఆర్ ఎక్స్ 100’ సినిమానే. ఆ తరువాత ఆయన వరుస సినిమాలు చేస్తూ వెళ్లినా తన కెరీర్ కు మాత్రం హిట్ దొరకలేదు. తమిళంలో చేసిన ‘వలిమై’ అటు తమిళంలో మాత్రమే కాకుండా ఇటు తెలుగులో కూడా ఆయనను నిరాశపరిచింది.
ఆ తరువాత కార్తికేయ నుంచి ఎటువంటి సినిమా అప్ డేట్ రాలేదు. కాగా తాజాగా ఈ యంగ్ హీరో బెదురులంక 2012 అనే చిత్రం చేస్తున్నట్టు సమాచారం.

కాగా ఈ సినిమా పేరును ప్రకటిస్తూ టైటిల్ పోస్టర్ తో పాటు మోషన్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు చిత్ర బృందం. కార్తికేయ చాలా స్టైలిష్ లుక్ తో ఈ పోస్టర్ లో కనిపిస్తున్నాడు. ‘వచ్చాడ్రా .. శివుడొచ్చాడ్రా’ అనే కోరస్ తో ఈ మోషన్ పోస్టర్ ను ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తుంది. ఈ మోషన్ పోస్టర్ ను ఆవిష్కరించిన తీరు కొత్తగానే కనిపిస్తూ, కాన్సెప్ట్ ఏమిటనేది వీక్షకుల అంచనాలకి అందడం లేదు. రవీంద్ర బెనర్జీ నిర్మిస్తున్న ఈ సినిమాకి క్లాక్స్ దర్శకత్వం వహిస్తుండగా మణిశర్మ సంగీతాన్ని సమకూర్చుతున్నారు. ఈ సినిమాలో నేహా శెట్టి కథానాయిగా నటించనున్నారు.

ఇదీ చదవండి: మంచి ఊపు తెప్పిస్తున్న “రంజితమే” తెలుగు పాట

Exit mobile version