Site icon Prime9

Balakrishna: నా వారసుడు వచ్చేస్తున్నాడు- బాలకృష్ణ

balakrishna-comments-on-his-son-mokshagna-debut

balakrishna-comments-on-his-son-mokshagna-debut

Balakrishna: సినిమా పరిశ్రమలో హీరోలు, దర్శకులు, నిర్మాతల వారసులు తెరంగేట్రం చేస్తూ అభిమానులను మన్ననలు పొందుతున్నారు. ఇకపోతే టాలీవుడ్ లో చాలా కాలంగా వారసుల హవా నడుస్తూనే ఉంది. మెగా, నందమూరి, అక్కినేని, దగ్గుబాటి కుటుంబాల నుంచి వచ్చిన పలువురు వారసులు ఇప్పటికే పరిశ్రమలలో నిలదొక్కుకున్నారు. అయితే తాజాగా మరో నట వారసుడు తెరపైకి రానున్నాడు. నందమూరి నటసింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ వచ్చే ఏడాది తెరంగేట్రం చేయనున్నట్ట స్వయానా బాలకృష్ణనే వెళ్లడించారు. చాన్నాళ్ల నుంచి మోక్షజ ఎంట్రీపై టాలీవుడ్ లో చర్చ నడుస్తోంది.

ఈ నేపథ్యంలో స్వయంగా బాలకృష్ణ తన వారసుడి తెరంగేట్రం గురించి గోవాలో ప్రస్తావించారు. మోక్షజ్ఞను వచ్చే ఏడాది పరిచయం చేస్తున్నట్టు వెల్లడించారు.
అయితే, అతని చిత్రానికి దర్శకుడు ఎవరన్నదానిపై క్లారిటీ ఇవ్వలేదు. తనకు పలు హిట్స్ ఇచ్చిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో మోక్షజ్ఞ తొలి సినిమా ఉంటుందా? అన్న ప్రశ్నకు ఆయన చిరునవ్వుతో సమాధానం దాటవేశారు. అంతా దైవేచ్ఛ అని నవ్వారు. మరోవైపు బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చి భారీ విజయం సొంతం చేసుకున్న అఖండ సినిమాకు సీక్వెల్ ఉందని బాలయ్య వెల్లడించారు. అఖండ2 కోసం సబ్జెక్ట్ కూడా సిద్ధం అయిందని, త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన చేస్తామని తెలిపారు.

ఇదీ చదవండి: నెట్టింట ట్రెండ్ అవుతున్న రాంచరణ్ న్యూలుక్

Exit mobile version