Site icon Prime9

DJ Tillu2: డీజే టిల్లుకు హీరోయిన్ కష్టాలు.. అనుపమ ఔట్.. ప్రేమమ్ బ్యూటీ ఇన్

anupama-parameswaran-walks-out-from-dj-tillu-sequel-tillu-square

anupama-parameswaran-walks-out-from-dj-tillu-sequel-tillu-square

DJ Tillu2: సిద్ధు జొన్నల గడ్డ, నేహా శెట్టి హీరో, హీరోయిన్‌గా అతి తక్కువ బడ్జెట్‌లో రూపొంది ఎవరూ ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సినిమా ‘డీజే టిల్లు’. విమల్ కృష్ణ దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్య దేవర నాగవంశీ ఈ చిత్రం భారీ వసూళ్లను సాధించింది.
అందువల్ల మూవీ మేకర్స్ దానికి సీక్వెల్ రూపొందిస్తున్నట్టు ప్రకటించారు. దీపావళి కానుకగా ఈ సినిమాకు ‘టిల్లు స్వ్కేర్’ టైటిల్ అనౌన్స్ చెయ్యగా ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. కాగా టిల్లు స్వ్కేర్ సినిమాకు ఆది నుంచి కష్టాలు వెంటాడుతున్నాయి.

ఈ సినిమా సీక్వెల్‌ డైరెక్షన్ నుంచి విమల్ కృష్ణ తప్పుకొన్నాడు. ఫలితంగా వేరే దర్శకుడు ‘టిల్లు స్క్వేర్’ ను డైరెక్ట్ చేస్తున్నాడు. సినిమాను ప్రారంభించినప్పుడు మొదటగా శ్రీ లీలను హీరోయిన్‌గా అనుకున్నారు. ఏమైందో తెలియదు కానీ ఈ చిత్రం నుంచి ఆమె తప్పుకొంది. శ్రీ లీల ప్లేస్‌లోకి అనంతరం అనుపమ పరమేశ్వరన్ వచ్చింది. అయితే తాజాగా అనుపమ కూడా డేట్స్ కుదరక ఈ సినిమా నుంచి తప్పుకొన్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు తెలుపుతున్నాయి. అనుపమ స్థానంలో తాజాగా ‘ప్రేమమ్’బ్యూటీ మడొన్నా సెబాస్టియన్‌ను హీరోయిన్‌గా తీసుకున్నారని టాక్ వినిపిస్తుంది. ఇకపోతే ‘టిల్లు స్వ్కేర్’ పై భారీ బజ్ ఉంది. ఆ అంచనాలను అందుకోవాలని మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. ఈ సినిమాకు మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. వచ్చే ఏడాది మార్చిలో మూవీని విడుదల చేస్తామని నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు.

ఇదీ చదవండి: సినిమాలకు సాయిపల్లివి గుడ్ బై.. షాక్ లో అభిమానులు

Exit mobile version