Site icon Prime9

Anchor Anasuya Bharadwaj: నాకు కొవ్వు బాగా ఎక్కువవుతుందంటున్న అనసూయ!

anasuya prime9news

anasuya prime9news

Anasuya Bharadwaj: బుల్లితెర పై, వెండితెర పై అనసూయకు మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఐతే ప్రస్తుతం అనసూయ బుల్లితెరకు దూరంగా ఉంది. జబర్దస్త్ షో నుంచి బయటకు వచ్చింది. అసలు ఈ ముద్దుగుమ్మ ఎందుకు వచ్చిందో సరైన కారణం ఇప్పటి వరకు బయటకు రాలేదు. కానీ ఈమె మాత్రం ఎంతో ఆలోచించి బయటకు వచ్చానని చెప్పుకొచ్చింది. ఈటీవీ నుంచి బయటకు వచ్చిన అనసూయ, స్టార్ మాలోని సింగింగ్ షోకు హోస్టుగా చేసింది. అనసూయకు ఇప్పుడు ఏ షో కూడా లేకుండా పోయింది.

ప్రస్తుతం అనసూయ కాంట్రవర్సీలతోనే ఎక్కువగా ఫేమస్ అవుతోంది. లైగర్ విషయంలో అనసూయ వేసిన ట్వీట్, తరువాత జరిగిన చర్చలు, ఆంటీ వివాదం మన అందరికీ తెలిసిందే. తనను ఎవరైనా ఆంటీ అని పిలిస్తే వారి మీద కేసు పెడతాను అనే స్థాయికి అనసూయ వెళ్లింది. మొన్నటి వరకు అనసూయ ఫారిన్ ట్రిప్‌లో మంచిగా ఎంజాయ్ చేసింది. దీనికి సంబంధించి అనసూయ తన ఫేస్ బుక్ స్టోరీలో ఓ వీడియోను కూడా షేర్ చేసింది.

ఈ మధ్య బాగా తింటున్నా, బాగా కొవ్వు వచ్చేస్తుంది. కానీ అదంతా ఎక్కడికి పోతోంది? ఇలా చెమట రూపంలో బయటకు వెళ్తోంది అంటూ తన వర్కౌట్ గురించి అనసూయ అభిమనులతో పంచుకుంది. చూస్తుంటే అనసూయ భాగానే కష్టపడినట్టు తెలుస్తుంది.

Exit mobile version