Site icon Prime9

Ali: గవర్నర్ ‘తమిళిసై’ ను కలిసిన అలీ..  

Ali

Ali

Hyderabad: నటుడు అలీ తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్ ని కలిశారు. అలీ పెద్ద కూతురు ఫాతిమా వివాహం నిశ్చయమైంది. ఇటీవల ఫాతిమా ఎంగేజ్‌మెంట్‌ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అలీ వివాహ ఆహ్వాన పత్రిక ప్రతిని గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ కి అందిస్తూ స్వయంగా వివాహానికి రావాలని ప్రత్యేకంగా ఆహ్వానించారు. పెళ్లి పత్రిక స్వీకరించిన తమిళిసై కూడా, తప్పకుండా వివాహానికి హాజరు అవుతానని అలీకి మాటిచ్చారు.

అలీని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎలక్ట్రానిక్‌ మీడియా ముఖ్య సలహాదారుగా నియమించిన సంగతి తెలిసిందే. రెండు రోజుల కిందట అలీ పదవీ బాధ్యతలు అప్పగించారు. ప్రభుత్వం తనకు అప్పగించిన ఏ పనైనా చిత్తశుద్దితో చేస్తానని, అవసరమైన సలహాలను అందిస్తానని అలీ చెప్పారు.

Exit mobile version