Site icon Prime9

Dil Raju: ఆదిపురుష్ సినిమా సూపర్ హిట్ అవుతుందంటున్న దిల్ రాజు

adhipurush prime9news

adhipurush prime9news

Tollywood: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా సినిమా ఆదిపురుష్ సినిమా టీజర్ పై సోషల్ మీడియాలో ఒక రేంజులో ట్రోల్స్ చేస్తున్నారు. ఎప్పుడైతే ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారో అప్పటి నుంచి జనం ఎవరిష్టం వచ్చినట్టు వారు సినిమా టీజర్ గురించి ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. తాజాగా దీని గురించి ప్రముఖ నిర్మాత దిల్ రాజు సీరియస్ గా రియాక్ట్ అయినట్టు తెలుస్తుంది.

ఆదిపురుష్ టీజర్‌ని కార్టూన్ వీడియోతో పోల్చుతూ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోలో శ్రీరాముడు, హనుమంతుడు, రావణుడి పాత్రలు హిందూ మత విశ్వాసాలను దెబ్బతీసేలా ఉన్నాయని చెబుతున్న వాళ్ళు ఇంకొందరు. రామాయణాన్ని వక్రీకరించి ఆదిపురుష్ షూటింగ్ చేసారంటూ తెగ ట్రోల్స్ వస్తున్నాయి.

ఈ వేదిక పై మాట్లాడిన దిల్ రాజు కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆదిపురుష్ టీజర్ పై వస్తున్న ట్రోల్స్‌ కి తనదైన మాటలతో నెగెటివ్ కామెంట్స్ చేసే వారికి గట్టిగా జవాబు ఇచ్చారు. ఈ సినిమా టీజర్ చూడగానే అమేజింగ్ అని ప్రభాస్‌కి వాయిస్ మెసేజ్ పెట్టానని ఆయన అన్నారు. బాహుబలి పార్ట్ 1 సినిమా చూసినప్పుడు కూడా చాలా మంది చాలా రకాలుగా ట్రోల్ చేశారు. కానీ ప్రభాస్‌కి అప్పుడే చెప్పా బాహుబలి సినిమా పెద్ద సూపర్ హిట్ అవుతుందని, ఇప్పుడు ఆదిపురుష్ సినిమా విషయంలో కూడా అదే జరుగుతుందని, చిన్న సెల్ ఫోన్ లో టీజర్ చూసి మీరు సినిమాను అంచనా వేయొద్దని దిల్ రాజు ఫైర్ అయ్యారు.

Exit mobile version