Site icon Prime9

Sarathkumar: ప్రముఖ నటుడు శరత్ కుమార్ కు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక

actor-sharat-kumar-get-illness-joined-in-hospital-in-chennai

actor-sharat-kumar-get-illness-joined-in-hospital-in-chennai

Sarathkumar: ప్రముఖ నటుడు శరత్ కుమార్ అస్వస్థతకు గురయ్యారు. ఆయనను కుటుంబ సభ్యులు చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. దానితో శరత్ కుమార్ భార్య, ప్రముఖ నటి రాధిక, కుమార్తె వరలక్ష్మి శరత్ కుమారు ఆస్పత్రికి చేరుకున్నారు. అయితే, శరత్ కుమార్ అస్వస్థతకు డయేరియా, డీహైడ్రేషన్ కారణమని వైద్యులు అంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, దీనికి సంబంధించిన అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.

ఇక శరత్ కుమార్ అస్వస్థతకు గురయ్యారనే విషయం తెలియడంతో సినీ వర్గాలు మరియు ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు.
శరత్ కుమార్ త్వరగా కోలుకోవాలని, క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఈ మేరకు ట్వీట్లు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. గతంలో శరత్ కుమార్‌ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆయన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుని ఆ మహమ్మారి నుంచి త్వరగా బయటపడ్డారు. ఇప్పుడు మళ్లీ ఆయన అస్వస్థతకు గురవడంతో అభిమానుల్లో కాస్త ఆందోళన నెలకొంది.

కాగా శరత్ కుమార్ ఇటీవల మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన పొన్నియన్ సెల్వన్-1 మూవీలో నటించి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు.

ఇదీ చదవండి:  భవదీయుడు కాదు “ఉస్తాద్ భగత్ సింగ్”.. పవన్ కల్యాణ్-హరీశ్ శంకర్ సినిమా టైటిల్ మార్పు..!

Exit mobile version