Site icon Prime9

Abbas: ఆసుపత్రి బెడ్ పై “ప్రేమదేశం హీరో అబ్బాస్”.. ఏమైందంటూ అభిమానుల ఆందోళన

actor-abbas-gets-surgery-to-his-injured-leg

actor-abbas-gets-surgery-to-his-injured-leg

Abbas: 90వ దశకంలో వచ్చిన ప్రేమదేశం సినిమా గురించి తెలియని వారుండరు. యూత్ ఫుల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. కాగా ఈ సినిమాతో హీరోగా పరిచయం అయిన అబ్బాస్ ఒక్క సినిమాతోనే స్టార్ డమ్ అందుకున్నాడు. ఆ కాలంలో అబ్బాస్ హెయిర్ స్టైల్ అంటే పడిచచ్చేవారు కుర్రకారు. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించిన అబ్బాస్ క్రమంగా తెరమరుగయ్యాడు.

అయితే తాజాగా అబ్బాస్ ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. హాస్పిటల్ బెడ్ పై ఒక ఫొటో, వాకింగ్ స్టిక్ నడుస్తూ మరో ఫొటో కనిపిస్తున్నాయి. వీటిని చూసిన అభిమానులు అబ్బాస్ కు ఏమైందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా దీని గురించి అబ్బాస్ వివరణ ఇచ్చారు. బైక్ పై నుంచి పడి గాయపడ్డానని, కొన్నిరోజులుగా విపరీతమైన కాలి నొప్పితో బాధపడుతున్నానని వెల్లడించారు. డాక్టర్లు శస్త్రచికిత్స తప్పనిసరి అని చెప్పారని తెలిపారు. సర్జరీ చేయించుకున్నాక ఎంతో ఉపశమనం పొందానని డాక్టర్లకు థాంక్స్ చెప్పుకుంటున్నాను అని వివరించారు.

కాగా, ఓ దశలో యూత్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న అబ్బాస్ కాలక్రమంలో అవకాశాలు రాక, చిత్ర రంగానికి దూరమయ్యాడు. ఇకదానితో కుటుంబంతో సహా విదేశాల్లో స్థిరపడ్డాడు.

ఇదీ చదవండి: శంకరాభరణం సినిమాకు అరుదైన గౌరవం

Exit mobile version
Skip to toolbar