Site icon Prime9

Karthika Deepam: “కార్తీకదీపం” అన్ స్టాపబుల్.. అరుదైన మైలురాయిని దాటిన వంటలక్క సీరియల్

karthika deepam serial successfully completed 1500 episode

karthika deepam serial successfully completed 1500 episode

Karthika Deepam: బుల్లితెర నాట కార్తీకదీపం సృష్టించిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టెలివిజన్ రంగంలో ప్రస్తుతం ఈ ధారావాహిక రారాజుగా కొనసాగుతుంది. గత 5 ఏళ్ల నుంచి టాప్ రేటెడ్ సీరియల్ గా కొనసాగుతుంది. టీఆర్పీలో ఈ సీరియల్ అసమాన రికార్డ్స్ నమోదు చేసింది. స్టార్ మా లో ప్రతిరోజు సాయంత్రం 7:30 నిమిషాలకు కార్తీకదీపం ప్రసారం అవుతుంది. కాగా ఆ సమయానికి తెలుగురాష్ట్రాల్లో ఏ ఇంట విన్నా చూసినా ఈ నాటికనే కనిపిస్తోంది. ఆ సమయానికి ప్రపంచకప్ టోర్నీ మ్యాచ్ లు జరుగుతున్నా వాటిని కూడా ఆ సమయం నుంచి మార్చమని ఐసీసీని అభ్యర్థించిన రోజులూ లేకపోలేదు. అంత ఫాలోయింగ్ ఉంది మరి ఈ సీరియల్ కి.

కార్తీకదీపం సీరియల్ మరో అరుదైన మైలురాయిని దాటింది. 2017 అక్టోబర్ 16న కార్తీకదీపం సీరియల్ ప్రారంభమయ్యి నేటి వరకు అన్ స్టాపబుల్ గా కొనసాగుతూ గత 5 సంవత్సరాలుగా నంబర్ పొజిషన్ లో కొనసాగుతుంది. కార్తీక్, దీప పాత్రలైతే మన ఇంట్లో కుటుంబ సభ్యులు అయిపోయారు. దీప క్యారెక్టర్ కి మరో పేరు వంటలక్క కాగా ఆమె భర్త కార్తీక్ ని డాక్టర్ బాబు అని పిలుచుకుంటుంది. ఇంక వీరిరువురు వంటలక్క, డాక్టర్ బాబు గానే బాగా ఫేమస్.

డైరెక్టర్ కాపుగంటి రాజేంద్ర ఈ మధ్య కాలంలో వంటలక్క, డాక్టర్ బాబు క్యారెక్టర్స్ ని చంపేశాడు. వారి ఇద్దరు కూతుళ్లతో సీరియల్ ను సరికొత్తగా నడిపే ప్రయత్నం చేశాడు. కానీ వంటలక్క, డాక్టర్ బాబు లేని కార్తీకదీపం సీరియల్ ని ప్రేక్షకులు ఊహించలేకపోయారు. దానితో టీఆర్పీ ఒక్కసారిగా పడిపోయింది. దీనిని గుర్తెరిగిన డైరెక్టర్ వెంటనే కథను మరో మలుపు తిప్పారు. వారిద్దరూ బ్రతికే ఉన్నారని వెంటనే వంటలక్క డాక్టర్ బాబులను రంగంలోకి దింపాడు. వీరిద్దరి రీ ఎంట్రీతో మరలా కార్తీకదీపం సీరియల్ కి పూర్వ వైభవం వచ్చింది. ఈ వంటలక్క సీరియల్ 15వ సెంచరీ(1500) సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది. ప్రేమి విశ్వనాథ్, నిరుపమ్, శోభా శెట్టి ప్రధాన పాత్రలు చేస్తున్నారు. ఐదేళ్ల ప్రయాణం సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్న కార్తీకదీపం భవిష్యత్ లో ఇంకెన్ని సంచలనాలు సృష్టించనుందో వేచి చూడాలి. కాగా ఈ మేరకు డాక్టర్ బాబు పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది

ఇదీ చదవండి: విరాటుకి వీర లెవెల్లో విషెష్.. తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయే కటౌట్స్

Exit mobile version