Site icon Prime9

Suriya: సూర్య 42 మోషన్ పోస్టర్ రిలీజ్.. యుద్ధభూమిలో అతి పరాక్రమవంతుడిగా లుక్

surya 42 motion poster prime9 news

surya 42 motion poster prime9 news

Tollywood:  సూర్య, ఈ హీరోకు దక్షిణాదిన క్రేజ్ ఎక్కువ. హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ చిత్రం సూర్య 42. అయితే చిత్ర యూనిట్ చడీ చప్పుడు లేకుండా మూవీ మోషన్ పోస్టర్ విడుదల చేసి అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చిందనే చెప్పుకోవాలి.

విజువల్ వండర్ గా రూపొందిన సూర్య 42 మోషన్ పోస్టర్ ను చూసిన ప్రేక్షకాభిమానులు సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నారు. యుద్ధ భూమిలో మంటలు చెలరేగుతుండగా, ఓ గద్ద ఆకాశంలో ఎగురుతూ వచ్చి నెమ్మదిగా సూర్య భుజం మీద వాలుతుండడాన్ని బ్యాక్ సైడ్ పిక్చర్ని చూపించారు. ఈ వీడియో చూసిన సినీ లవర్స్ కి రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. ఆయుధాలు చేత పట్టి సూర్య యుద్ధ వీరుడిగా ఈ పోస్టర్లో కనిపిస్తున్నాడు. చారిత్రక నేపథ్యంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమాగా కనిపిస్తోంది. దీనికి మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ అందించిన బీజీఎం అదిరిపోయింది.

అటు తమిళం ఇటు తెలుగులో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సూర్య. తెలుగు రాష్ట్రాల్లో సూర్యకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం ఆయన సూర్య 42 చిత్రంతో బిజీబిజీగా ఉన్నారు. కాగా సిరుతై శివ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి.

మరిన్ని సినీ వార్తల కోసం క్లిక్ చెయ్యండి

ఇదీ చదవండి: Yashoda Teaser: యశోద టీజర్ అవుట్.. అదరగొట్టిన సామ్..!

 

Exit mobile version