Shah Khan Comments on South Heros: బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దేశవ్యాప్తంగా ఆయనకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎన్నో చిత్రాల్లో లవర్ బాయ్‌గా అలరించారు. 50 పదుల వయసులోనూ షారుక్ తన సక్సెస్ చరిష్మాను కొనసాగిస్తున్నారు. నేటి యంగ్ హీరోలు సైతం ఆయనను బీట్ చేయలేకపోతున్నారు. ప్రస్తుతం సౌత్ హీరోలు బాలీవుడ్లో హిట్స్ కొడుతున్న దుమ్మురేపుతున్నారు.
ఈ క్రమంలో షారుక్ ఖాన్ సౌత్ హీరోలపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. గణతంత్ర్య దినోత్సవం సందర్భంగా దుబాయ్ గ్లోబల్ విలేజ్ వేదికగా జరిగని కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్టేజ్ తనదైన వాక్చాతుర్యంతో ఆడియన్స్‌ని అలరించారు. అంతేకాదు తన చిత్రాల గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా షారుక్ దక్షిణాది ఫ్యాన్స్‌ని ఉద్దేశిస్తూ ప్రసంగించారు. “ఆంధ్ర, తెలంగాణ,కేరళ, కర్ణాటక, తమిళనాడు నుంచి నాకు లక్షలాది అభిమానులు, చాలా మంది స్నేహితులు ఉన్నారు.
వారిలో అల్లు అర్జున్, ప్రభాస్, రామ్ చరణ్, మహేష్ బాబు, దళపతి విజయ్, యష్, రజనీకాంత్ సర్, కమల్ హాసన్ స్టార్స్ నాకు మంచి స్నేహితులు. కానీ, వారందరికి నా నుంచి ఒక విజ్ఞప్తి ఉంది. పాటలకు వేగంగా డ్యాన్స్ చేయడం ఆపండి. ఎందుకంటే నేను మీలా డ్యాన్స్ చేయలేను. డ్యాన్స్ విషయంలో వారికి నేను పోటీ ఇవ్వడం చాలా కష్టమైన పని. ఈ వయసులో మీలా డ్యాన్స్ చేయలేను” అంటూ చమత్కరించారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
.@Actorvijay , @urstrulyMahesh , #Prabhas , @AlwaysRamCharan , @alluarjun are my Close friends ~ @iamsrk 🔥pic.twitter.com/xCWBaLJuBS
— Let's X OTT GLOBAL (@LetsXOtt) January 28, 2025