Site icon Prime9

Tiger 3 : సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ “టైగర్ 3” టీజర్ రిలీజ్.. దుమ్ము రేపిన యాక్షన్ సీన్స్

salman khan and katrina starring tiger 3 movie trailer released

salman khan and katrina starring tiger 3 movie trailer released

Tiger 3 : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్.. వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఒక వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బిగ్ బాస్ కి హోస్ట్ గా వ్యవహరిస్తూ అదరగొడుతున్నారు. కాగా  సల్మాన్ ప్రస్తుతం మనీష్ శర్మ దర్శకత్వంలో “టైగర్ 3” లో నటిస్తున్నారు. అంతకు ముందు వచ్చిన ఏక్తా టైగర్, టైగర్ జిందా హై సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఇక పోతే యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ సమర్పణలో రానున్న ఈ చిత్రానికి ఆదిత్య చోప్రా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ ఈ సినిమాలో విలన్ గా చేస్తుండటం విశేషం.

కాగా ఇప్పటికే యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ ని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. హృతిక్ రోషన్ “వార్”,  షారుఖ్ ఖాన్ “పఠాన్”.. సినిమాలు ఇప్పటికే రికార్డుల మోత మోగించాయి. ఈ కోవలోనే ఇప్పుడు ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. షారుఖ్ పఠాన్ సినిమాలో సల్మాన్ ఖాన్ గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చాడు. ఇప్పుడు టైగర్ 3 సినిమాలో కూడా షారుఖ్ గెస్ట్ అప్పిరెన్స్ ఇవ్వనున్నాడని సమాచారం. దీంతో సల్మాన్ అభిమానులే కాక బాలీవుడ్ కూడా ఈ సినిమాపై అంచనాలు పెట్టుకుంది. అయితే శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా నవంబర్ 12 రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ క్రమంలోనే తాజాగా మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేశారు.

ఈ సినిమా లో సల్మాన్ తన దేశంతో పాటు తన కుటుంబం కోసం కూడా ఫైట్ చేయనున్నాడని ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది. దేశం కావాలో, కుటుంబంలో కావాలో తేల్చుకోవాల్సిన పరిస్థితి ఎదురైనప్పుడు సల్మాన్ ఏం చేశాడు.. తన కుటుంబాన్ని అతను కాపాడుకోగలిగాడా.. ఉగ్రవాదులకు సహాయం చేసినట్లు ప్రచారం జరగడంతో తన నిజాయితీని ఎలా ప్రూవ్ చేసుకున్నాడు.. చివరికి ఏం జరిగింది అనేది మూవీ స్టోరీ అని తెలుస్తుంది. ఇక విలన్ గా బాలీవుడ్ ప్రముఖ హీరో ఇమ్రాన్ హష్మి నటించడం గమనార్హం. ట్రైలర్ మొత్తం మధ్యమధ్యలో షాడోలో కనిపించే ఇమ్రాన్ ను.. ట్రైలర్ చివరిలో అద్భుతంగా చూపించారు. వెల్‌కమ్ టు పాకిస్థాన్ టైగర్ అంటూ సల్మాన్ కు స్వాగతం పలుకుతూ ఇమ్రాన్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది. కత్రినా కూడా యాక్షన్ సీన్స్ లో దుమ్ము రేపింది. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ తో దూసుకుపోతుంది.

 

 

Exit mobile version